Monday, October 12, 2020

CBSE 'క్లాస్-10' కంపార్ట్‌మెంట్ ఫ‌లితాలు విడుద‌ల‌


* 56.55 శాతం మంది ఉత్తీర్ణత

సీబీఎస్‌ఈ ప‌దోత‌ర‌గ‌తి కంపార్ట్‌మెంట్ ప‌రీక్షల ఫ‌లితాల‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ విడుద‌ల చేసింది. ఫలితాల్లో మొత్తం 56.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు.

ప‌రీక్షకు మొత్తం 1,57,866 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 1,49,726 మంది విద్యార్థులు ప‌రీక్షకు హాజ‌ర‌య్యారు. ఇందులో 82,903 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యార‌ని సీబీఎస్సీ ప్రక‌టించింది. ప‌రీక్ష రాసిన విద్యార్థులు ఫ‌లితాల‌ను వెబ్‌‌సైట్ ద్వారా చూసుకోవ‌చ్చు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

దేశ‌వ్యాప్తంగా 1248 కేంద్రాల్లో సెప్టెంబ‌ర్ 22 నుంచి 30 వ‌ర‌కు కంపార్ట్‌మెంట్ ప‌రీక్షలు జ‌రిగాయి. ఫ‌లితాల‌ను 12 రోజుల వ్యవధిలోనే విడుద‌ల చేశారు. కాగా, సీబీఎస్సీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను జూలై 15న ప్రకటించింది.

అందులో 91.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. అక్టోబరు 9న సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా 10వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలను వెల్లడించింది.

Friday, October 9, 2020

APEAMCET 2020 Toppers List | ఏపీ ఎంసెట్ టాపర్ల వివరాలుఏపీ ఎంసెట్ (AP EAMCET 2020 Result)‌ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం (అక్టోబరు10) ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.

లాక్‌డౌన్ కారణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఎంసెట్ పరీక్షలను గత నెల సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఎంసెట్ 2020 (AP EAMCET) ఇంజినీరింగ్‌కు సుమారు 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా.. 84. 38 శాతం(సుమారు 1,56,899) మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 87,652 మంది దరఖాస్తు చేసుకోగా.. 75,834 మంది పరీక్షలు రాశారు.

ఎంసెట్ ఇంజినీరింగ్ టాప్-10 ర్యాంకర్లు..

1వ ర్యాంకు: వావిలపల్లి సాయినాథ్‌(విశాఖ)

2వ ర్యాంకు: కుమార్‌ సత్యం(హైదరాబాద్)

3వ ర్యాంకు: గంగుల భువన్‌రెడ్డి(ప్రొద్దుటూరు)

4వ ర్యాంకు: ఎం.లిఖిత్‌రెడ్డి(రంగారెడ్డి)

5వ ర్యాంకు: సీహెచ్‌ కౌశల్‌కుమార్‌ రెడ్డి(సికింద్రాబాద్)

6వ ర్యాంకు: కె.వి.దత్త శ్రీహర్ష(రాజమహేంద్రవరం)

7వ ర్యాంకు: వారణాసి సాయితేజ(రంగారెడ్డి)

8వ ర్యాంకు: హార్దిక్‌ రాజ్‌పాల్‌ (రంగారెడ్డి)

9వ ర్యాంకు: కొత్తకోట కృష్ణసాయి(శ్రీకాకుళం)

10వ ర్యాంకు: జితేంద్ర (విజయనగరం)

అగ్రికల్చర్‌, మెడిసిన్‌లో ర్యాంకర్లు వీరే..

1వ ర్యాంకు: చైతన్య సింధు(తెనాలి)

2వ ర్యాంకు: లక్ష్మి సామయి మారుతి (తాడికొండ)

3వ ర్యాంకు:మనోజ్‌ కుమార్ (తిరుపతి)

4వ ర్యాంకు: దరశి విష్ణుసాయి( నెల్లూరు)

5వ ర్యాంకు: సుభాంగ్ ( హైదరాబాద్)

6వ ర్యాంకు: హవీష్‌రెడ్డి(హైదరాబాద్)

7వ ర్యాంకు: లిఖిత (కడప)

8వ ర్యాంకు: జడ వెంకటవినయ్(వేంపల్లి)

9వ ర్యాంకు: నితిన్ వర్మ(కర్నూలు)

10వ ర్యాంకు: రేవంత్ (గుంటూరు)

AP EAMCET Results | ఏపీఎంసెట్ ఫలితాలు వెల్లడి.. ఉత్తీర్ణత వివరాలు ఇలా


ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యార్థులు ఎంసెట్‌ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు

ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. గత నెల సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్‌ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ విభాగంతో  1,33,066 మంది విద్యార్థులు, అగ్రికల్చర్‌, మెడిసిన్ విభాగంలో 69,616 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..


AP EAMCET 2020 Results | ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల


 
ఏపీ ఎంసెట్ (AP EAMCET Result)‌ వచ్చేశాయి. విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం (అక్టోబరు10) ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదచేయాల్సి ఉంటుంది.


ఫలితాల కోసం క్లిక్ చేయండి (వెబ్‌సైట్-2)..

ఇతర వెబ్‌సైట్లు...వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 9న ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. తెలంగాణ ఎంసెట్ (Telangana EAMCET)‌ ఫలితాల్లో చోటుచేసుకున్న సమస్యల కారణంగా.. అలాంటి పరిస్థితుల మాదిరే ఇక్కడా ఏమైనా ఉంటాయేమో అనే అనుమానంతో.. మరోసారి ఫలితాలను క్షుణ్నంగా పరిశీలించాకే విడుదల చేశారు.

Also Read: CBSE 12th Compartment Result 2020: సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్‌ ఫలితాలు విడుదల

లాక్‌డౌన్ కారణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఎంసెట్ పరీక్షలను గత నెల సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఎంసెట్ 2020 (AP EAMCET) ఇంజినీరింగ్‌కు సుమారు 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా.. 84. 38 శాతం(సుమారు 1,56,899) మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.

ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 87,652 మంది దరఖాస్తు చేసుకోగా.. 75,834 మంది పరీక్షలు రాశారు. వీటి ఫలితాలను అక్టోబరు 10న వెల్లడించనున్నారు.

ఫలితాలు ఇలా చూసుకోండి..

  •  Visit the official website of AP EAMCET 2020
  • Open the link and search for ‘AP EAMCET-2020 Results’ link.
  • Enter your registration number and date of birth.
  • Click on ‘View Results’.
  • The results will be displayed on your screen.
  • Take a printout of the result and secure till counselling procedure.

మరిన్ని విద్యాసంబంద కథనాల కోసం క్లిక్ చేయండి.. 

Tuesday, October 6, 2020

TSPSC Group 4 Results | గ్రూప్‌-4 ఫలితాలు విడుదల

తెలంగాణ (Telangana) లో మరో కీలక నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (TSPSC) గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు మంగళవారం (అక్టోబరు 6) సాయంత్రం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ ఈ ఫలితాలను విడుదల చేశారు. 

2018లో 1,595 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయింది. వాటికి సంబంధించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుద‌ల చేసింది. అయితే ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా కోసం అధికారిక ‌వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వాలి.

జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాల ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఇదిలాఉంటే.. ఈ గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇదిలాఉంటే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 30,723 నియామకాల‌ను చేప‌ట్టిన‌ట్లు కార్య‌ద‌ర్శి వాణి ప్ర‌సాద్ తెలిపారు.

Monday, October 5, 2020

TS EAMCET Results | తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. 75.29 శాతం ఉత్తీర్ణత నమోదు


 తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ (టీఎస్ ఎంసెట్) ప్రవేశపరీక్ష ఫ‌లితాలు మంగ‌ళ‌వారం (అక్టోబరు 6న) విడుద‌లయ్యాయి. మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్టీయూ క్యాంప‌స్‌లో విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుద‌ల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు వివిధ వెబ్‌సైట్ల‌ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. 

ఎంసెట్‌లో 75.29శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 89,734మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి (వెబ్‌సైట్-1)..


ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి (వెబ్‌సైట్-2)..


9 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ..
ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు అక్టోబరు 9 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 9 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అక్టోబరు 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు అక్టోబరు 12 నుంచి 20 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు.

అక్టోబరు 29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది. అక్టోబరు 30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. అక్టోబరు 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వీరికి నవంబర్‌ 2న సీట్లను కేటాయించనున్నారు.

కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కూడా మిగిలిన సీట్ల భర్తీకి నవంబరు 4న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.

మరిన్ని విద్యాఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి..

Sunday, October 4, 2020

JEE Advanced 2020 Results | జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు విడుదల


దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన‌ ఐఐటీల్లో ప్రవేశాల‌కోసం నిర్వహించిన‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫ‌లితాలు సోమవారం(అక్టోబరు 5) విడుదలయ్యాయి. ఉదయం 10 గంట‌ల‌కు ఐఐటీ ఢిల్లీ ఫలితాలను విడుద‌ల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ఫలితాలతోపాటు కటాఫ్ మార్కుల వివరాలను కూడా ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లో ఉన్న 13,600 సీట్లను భ‌ర్తీ చేయ‌నున్నారు.

సెప్టెంబరు 27న దేశ‌వ్యాప్తంగా 222 ప‌ట్టణాల్లో 1,001 కేంద్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష నిర్వహించారు. ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారిలో 96 శాతం మంది విద్యార్థులు ప‌రీక్షకు హాజ‌ర‌య్యారు. వీరిలో పేప‌ర్-1 పరీక్షకు 1,51,311 మంది విద్యార్థులు, పేప‌ర్-2 పరీక్షకు 1,50,900 మంది విద్యార్థులు హాజరయ్యారు.

అక్టోబరు 6 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ
అక్టోబరు 6 నుంచి ప్రవేశ ప్రక్రియ (జోసా) ప్రారంభ‌ంకానుంది. న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు మొత్తం ఆరు విడుత‌ల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల‌కు అక్టోబరు 6 నుంచి కౌన్సెలింగ్ ఉంటుంది.

Joint Seat Allocation Authority (JoSAA) 2020 Website

TS EAMCET for Corona Candidates | ‘క‌రోనా’ అభ్యర్థు‌లకు అక్టోబరు 8న ఎంసెట్‌

 
అక్టోబరు 5తో ముగియనున్న దరఖాస్తు గడువు


కరోనా బారి‌న‌ప‌డి సెప్టెంబరు 9 నుంచి 14‌ వ‌రకు నిర్వహించిన తెలంగాణ ఎంసె‌ట్‌కు హాజ‌రు‌కా‌లే‌క‌పో‌యిన విద్యార్థుల కోసం అక్టోబరు 8న ప్రత్యే‌కంగా ఎంసెట్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పా‌ట్లు‌ చే‌స్తు‌న్నా‌మని కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ గోవ‌ర్ధన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Also Readకేయూలో దూర‌విద్య యూజీ, పీజీ ప్రవేశాలు

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కరోనా పాజి‌టివ్‌, నెగె‌టివ్‌ సర్టి‌ఫి‌కె‌ట్లతో‌పాటు హాల్‌టికెట్‌ కూడా కన్వీ‌నర్‌ ఈమెయి‌ల్‌కు అక్టోబరు 5 అర్ధరా‌త్రి‌లోగా పంపాలని ఆయన సూచిం‌చారు.

Also Read:  Midhani Jobs: మిశ్రధాతు నిగం లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. 

వీరికి పరీక్ష కేంద్రం, సీబీటీ కోసం స్లాట్‌ బుక్‌‌చేసి, ఆ సమా‌చా‌రాన్ని తెలి‌య‌జే‌స్తా‌మని వివ‌రిం‌చారు. ఇందుకు convenertseamcet2020@jntuh.ac.inను సంప్రదిం‌చా‌లని తెలి‌పారు.

Officaial Website

మరిన్ని విద్యాఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి..


Saturday, October 3, 2020

Moratorium | రుణాలపై వడ్డీ మాఫీ.. సామాన్యుడికి భారీ ఊరట


 
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ పరిణామాల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై మారటోరియం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే గడువు ముగిసిన తర్వాత వడ్డీ మీదవడ్డీ వసూళ్లపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో 6 నెలల మారటోరియం కాలం (మార్చి1- ఆగస్టు 31)లో వడ్డీని వదులుకునే భారాన్ని ప్రభుత్వం భరించడమే ఏకైక పరిష్కారం అని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. 


ఈ నిర్ణయంతో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)లతో పాటు, వ్యక్తిగత, విద్య, గృహ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో మొదలైన చిన్నరుణగ్రహీతలకు ఈ మినహాయింపు భారీ ఉపశమనం లభించనుంది. తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా వడ్డీపై మాఫీ అమలు కానుంది. ఈ మేరకు, మాజీ కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఆమోదించింది.

దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ స్థితిలో రుణగ్రహీతలకు సహాయం చేసేందుకు మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని వదులుకోవడం వల్ల కలిగే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులపై 6 లక్షల కోట్ల భారం పడుతుందని పేర్కొంది. 

కాగా కరోనా మహమ్మారి సంక్షోభం, లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే వడ్డీ మీదవడ్డీ వసూళ్లపై సుప్రీం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఆర్బీఐ వెనక దాక్కుంటారా, వ్యాపారమే ముఖ్యం కాదు, ప్రజలకు ఊరట కలిగించడం ప్రధానమే అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే.    

Midhani Jobs | మిశ్రధాతు నిగం లిమిటెడ్‌లో ఉద్యోగాలు


మిశ్రధాతు నిగం లిమిటెడ్ (మిధాని) ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

★ మొత్తం ఖాళీలు: 158

★ ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్

Read Also: Army Public School’లో 8000 టీచింగ్ పోస్టులు.. వివరాలు

విభాగాలు-ఖాళీలు:
 ఫిట్టర్: 50
 ఎలక్ట్రీషియన్: 48
 మెషినిస్ట్: 20
 టర్నర్: 20
 వెల్డర్: 20

అర్హత: అభ్యర్థులు ఐటిఐ (సంబంధిత ట్రేడ్స్) కలిగి ఉండాలి.

Read Also: PNB Jobs: పీఎన్‌బీలో 535 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మెరిట్ (ITI – NCVT) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్ణయించబడుతుంది. తుది ఎంపిక సర్టిఫికేట్ ధృవీకరణకు లోబడి ఉంటుంది మరియు మెడికల్ ఫిట్‌నెస్.

దరఖాస్తు హర్డు కాపి పంపడానికి చివరితేది: 16-10-2020.

దరఖాస్తు హర్డు కాపిలు పంపాల్సిన చిరునామా:
Deputy Manager (TIS &Apprenticeship Training),
Mishra Dhatu Nigam Limited,
Kanchanbagh, Hyderabad – 500058

Notification 

Apprentice Registration 

Website 

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..

Tuesday, September 29, 2020

AP EAMCET 2020 | కరోనాతో ఏపీ ఎంసెట్‌ రాయని వారికి మరో అవకాశంఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్‌-2020కు కరోనా సోకి హాజరు కాలేకపోయిన విద్యార్థులకు పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ఏపీ ఎంసెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూకే వీసీ ప్రొ.ఎం.రామలింగరాజు తెలిపారు.

ఇప్పటికే 20 మంది విద్యార్థులు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఆశ్రయించారన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే హెల్ప్‌లైన్‌ సెంటర్‌ helpdeskeamcet2020@gmail.com కి ఎంసెట్‌ హాల్‌టికెట్‌, కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టులను సెప్టెంబ‌రు 30 సాయంత్రం 5గంటల్లోగా పంపించాలని సూచించారు. వీరికి పరీక్ష నిర్వహించే తేదీని వెబ్‌సైట్ ద్వారా 
తెలియజేస్తామన్నారు.

https://sche.ap.gov.in/eamcet 


Monday, September 28, 2020

Gold Rates | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు


 
దేశంలో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.194 త‌గ్గి రూ.50,449కి చేరింది.

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డ‌మే దేశంలో బంగారం ధ‌ర త‌గ్గడానికి కార‌ణ‌మైంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేష‌కులు తెలిపారు. కాగా, గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.50,643 వ‌ద్ద ముగిసింది. 

దేశీయ మార్కెట్ల‌లో వెండి ధ‌ర‌లు కూడా స్వ‌ల్పంగా త‌గ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.933 త‌గ్గి రూ.59,274కు చేరింది.

 గ‌త ట్రేడ్‌లో వెండి 60,207 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1857 డాల‌ర్ల‌కు దిగివ‌చ్చింది. ఔన్స్ వెండి ధ‌ర కూడా 22.70 డాల‌ర్ల‌కు చేరింది.   

Friday, September 25, 2020

SP Balu: తిరిగిరాని లోకాలకు గాన గంధ‌ర్వుడు

 గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్రహ్మణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు.

త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారు. బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందు ధృవీకరించారు.

చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

సందర్శకుల కోసం చెన్నై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలుకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆగ‌స్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయ‌న మృతి చెంద‌డం ప‌ట్ల‌ ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. సోష‌ల్ మీడియాలో ప‌లువురు సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.

Tuesday, September 22, 2020

CPGET 2020: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 'సీపీగెట్'.. పూర్తి వివరాలు ఇలా.!

            

తెలంగాణలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(CPGET) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబరు 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తు చేసుకోవడానికి రూ.500 ఆలస్యరుసుముతో అక్టోబరు 26 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో అక్టోబరు 29 వరకు అవకాశం కల్పించారు. ఈ సారి CPGET పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. మొత్తం 46 సబ్జెక్టులలో పరీక్ష జరుగనుంది. పాత జిల్లాలో పరీక్షలు నిర్వహించనున్నారు. 


సీపీగెట్ వివరాలు..

* సీపీగెట్ (కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్) - 2020

సీట్ల సంఖ్య: 30,000

ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్ టీయూహెచ్‌ (ఎంఎస్సీ కోర్సు).

కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర సంప్రదాయ పీజీ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు కలిపి మొత్తం 60 కోర్సులు.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా.

దరఖాస్తు ఫీజు...

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్కో సబ్జెక్టుకు రూ.800 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. ఇతర సబ్జెక్టు కూడా రాయాలనుకునేవారు అదనంగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రాంరంభం: 18.09.2020

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.10.2020

* రూ.500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 26.10.2020

* రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 29.10.2020

* ప్రవేశ పరీక్ష తేదీ: 31.10. 2020 - 09.11.2020 వరకు.

Notification

Website   

Monday, September 21, 2020

GNM కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుకు 2 రోజులే గడువు!

 * ఏఎన్‌ఎం పూర్తి చేసిన వారికి అవకాశం

* కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎం)మూడు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర వైద్య విద్యా డైరెక్టరేట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఇదివరకే ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన వారికి, నేరుగా ఇదే కోర్సు చేసే వారికి అవకాశం కల్పించారు. జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వా రికి ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో ప్రాధాన్యముంటుంది. ఉన్నత వైద్య విద్యకు కూడా దోహదపడుతుంది. 

రాష్ట్రవ్యాప్తంగా 6 ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలున్నాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా నర్సింగ్‌ కళాశాలలో 62 (60 సీట్లు కొత్త వారికి, మరో 2 సీట్లు ఇన్‌సర్వీస్‌లో ఉన్నవారికి), గాంధీ ఆసుపత్రిలోని నర్సింగ్‌ పాఠశాలలో 62 సీట్లు, వరంగల్‌లోని ఎంజీఎం నర్సింగ్‌ పాఠశాలలో 62 సీట్లు, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని నర్సింగ్‌ పాఠశాలలో 27 సీట్లు, కరీంనగర్‌లోని నర్సింగ్‌ పాఠశాలలో 42 సీట్లు, నిజామాబాద్‌ నర్సింగ్‌ పాఠశాలలో 32 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

అర్హతలివే..!

వీటికి 40 శాతం ఇంటర్‌ మార్కులతో, తత్సమాన కో ర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్‌ సబ్జెక్టుల వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 2020 జూలై 1 నాటికి 16 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజ ర్వ్‌డ్‌ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తులను ఈనెల 24 లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్‌ కాపీలను పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు అందించాలి. 

ఉద్యోగావకాశాలు ఎక్కువే..!

ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు జీఎన్‌ఎం కోర్సులో చేరవచ్చు. కోర్సు  పూర్తి చేసినవారికి ప్రైవేట్‌, ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఇక్కడ చదివిన విద్యార్థినులు 60 శాతానికి పైగా మార్కులతోనే ఉత్తీర్ణులవుతున్నారు. కార్పొరేట్‌ దవాఖానాల్లో నెలకు రూ.20వేలకు పైగా వేతనంతో పని చేస్తున్నారు. ఇక్కడ మూడేళ్ల వ్యవధిలో పూర్తిస్థాయిలో థియరీ, ప్రాక్టికల్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నాం. విద్యార్థినులకు ప్రాక్టికల్స్‌కు దవాఖాన అందుబాటులో ఉండడంతో జీఎన్‌ఎం కోర్సు పూర్తవగానే ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

వెబ్‌సైట్

RRB NTPC Application Status | ఎన్టీపీసీ పోస్టుల అప్లికేషన్ స్టేటస్ వచ్చేసింది.. పరీక్ష ఎప్పుడంటే?


భారతీయ రైల్వేల్లో ఎన్టీపీసీ (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 15 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల కంటే ముందుగా.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఎన్టీపీసీ ‘అప్లికేషన్ స్టేటస్’ను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తును స్వీకరించారా లేదా రిజక్ట్ చేశారా అన్నది తెలుసుకోవచ్చు. 

దరఖాస్తులు సరిగ్గా ఉన్న అభ్యర్థులను మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. దరఖాస్తులు రిజక్ట్ అయిన అభ్యర్థులు.. అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాతే అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. అప్లికేషన్ స్టేటస్ సెప్టెంబరు 21 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాల ద్వారా అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.


అప్లికేషన్ స్టేటస్ వివరాల కోసం క్లిక్ చేయండి.. 


రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ రైల్వే జోన్ల పరిధిలో 35,277 నాన్‌టెక్నికల్ పాపులర్ కేటిగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 28న రైల్వేశాఖ నోటిఫికేషన్ వెల్లడించింది. అభ్యర్థుల నుంచి మార్చి 1 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది.

ఎన్టీపీసీ పోస్టులతో కలిపి మొత్తం 1,40,640 రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు కూడా డిసెంబరులోనే ప్రారంభంకానున్నాయి. వీటిలో ఎన్టీపీసీ, లెవల్-1 పోస్టులు, ఐసోలేటెడ్ & మినిస్టేరియల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. పరీక్షలకు 10 రోజుల మందుగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్టీపీసీ పోస్టుల రాతపరీక్ష విధానం…

మొత్తం 100 మార్కులకు ‘స్టేజ్-1’ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.

మొదటి విడత పరీక్షలో అర్హత సాధించిన వారికి ‘స్టేజ్-2’ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 మార్కులకు రెండో విడత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.

పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.

రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.


Saturday, September 19, 2020

APSET – 2020 పరీక్షతేదీ మార్పు.. దరఖాస్తు గడువు పెంపు!

 


* బీఎస్సీ చేసిన విద్యార్థులకూ అవకాశం

* ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఏఐసీటీఈ ఉత్తర్వులు

ఏపీలోని విశ్వవిద్యాల‌యాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల‌కు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీసెట్‌‌) పరీక్ష తేదీని అధికారులు ఖరారు చేశారు. డిసెంబరు 20న ఏపీసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఏపీసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే అక్టోబరు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 19 వరకు దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే అక్టోబరు 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఆలస్య రుసముతో నవంబరు 11 వరకు..
ఏపీసెట్‌కు దరఖాస్తుకు అపరాధ రుసుముతో కూడా అవకాశం కల్పించారు. రూ.1000 అపరాధ రుసుముతో అక్టోబరు 12 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో అక్టోబరు 21 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో నవంబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిసెంబరు 12 నుంచి హాల్‌టికెట్లు..
డిసెంబరు 20న నిర్వహించనున్న ఏపీసెట్ పరీక్ష హాల్‌టికెట్లను డిసెంబరు 12 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
వెబ్‌సైట్

Bank Jobs: SBI’లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. అర్హతలివే!


స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అక్టోబరు 8తో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.

పోస్టులవారీగా అభ్యర్థుల వయోపరిమితిని నిర్ణయించారు. అభ్యర్థులు 24-55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు..

* స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులు: 92

1) డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ): 28

అర్హత: డిగ్రీ.

అనుభవం: త్రివిధ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్‌/ పోలీస్ ఆఫీసర్ (ఏఎస్పీ/డిప్యూటీ ఎస్పీ) 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

2) మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్): 05

అర్హత: ఎంబీఏ/పీజీడీఎం లేదా బీఈ/బీటెక్‌తో పీజీ డిగ్రీ (మేనేజ్‌మెంట్) ఉండాలి.

అనుభవం: సంబంధిత రంగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.

Notification

Online Application

3) డేటా ట్రైనర్: 01

4) డేటా ట్రాన్స్‌లేటర్: 01

5) సీనియర్‌ కన్సల్టెంట్‌ అనలిస్ట్‌: 01

6) అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ETA): 01

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ.

అనుభవం: పోస్టులవారీగా 7 – 14 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Notification

Online Application

7) పోస్ట్-డాక్టోరల్ రిసెర్చ్ ఫెలోషిప్: 05

కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: పీహెచ్‌డీ (బ్యాంకింగ్/ఫైనాన్స్/ఎకనామిక్స్)

అనుభవం: సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.

Notification

Online Application

8) డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్: 01

అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.

అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 15 సంత్సరాల అనుభవం ఉండాలి.

Notification

Online Application

9) డిప్యూటీ మేనేజర్ (డేటా సైంటిస్ట్): 11

అర్హత: బీటెక్/ఎంటెక్/ఎంబీఏ/పీజీడీఎం.

అనుభవం: 3 సంవత్సరాలు.

10) మేనేజర్ (డేటా సైంటిస్ట్): 11

అర్హత: బీటెక్/ఎంటెక్/ఎంబీఏ/పీజీడీఎం.

అనుభవం: 5 సంవత్సరాలు.

11) డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్ ఆఫీసర్): 05

అర్హత: బీటెక్/ఎంటెక్.

అనుభవం: 3 సంవత్సరాలు.

Notification

Online Application

12) రిస్క్‌ స్పెషలిస్ట్‌: 19

13) పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌: 3

అర్హత: సీఏ/సీఎఫ్‌ఏ/ఎంబీఏ/పీజీడీఎం/ఎంఎస్సీ.

అనుభవం: పోస్టులవారీగా 2 – 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Notification

Online Application