Monday, August 31, 2020

IIM-విశాఖ‌ప‌ట్నంలో టీచింగ్ పోస్టులు



విశాఖ‌ప‌ట్నంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) ప్రొఫెసర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీహెచ్‌డీ అర్హతతోపాటు తగు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివ‌రాలు…

* టీచింగ్ ఫ్యాకల్టీలు

  1. అసోసియేట్ ప్రొఫెస‌ర్‌
  2. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్

విభాగాలు: డెసిషన్ సైన్సెస్; ఎకనామిక్స్ & సోషల్ సైన్సెస్; ఎంటర్ ప్రెన్యూయర్‌‌షిప్; ఫైనాన్స్ & అకౌంటింగ్; ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్; మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్; మార్కెటింగ్; ఆర్గనైజేషనల్ బిహేవియర్ & హెచ్ఆర్‌ఎం; ప్రొడక్షన్ & ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజీ.

అర్హత‌: పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌, అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తును స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రింట్ కాపీతోపాటు ఇతర సర్టిఫికేట్లను అటెస్టేషన్ చేయించి సంబంధిత చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 28.09.2020.

దరఖాస్తు హార్డ్ కాపీలు చేరడానికి చివరితేది: 17.10.2020.

దరఖాస్తులు పంపాల్సి చిరునామా:
The Senior Administrative Officer
Indian Institute of Management Visakhapatnam
Andhra University Campus
Visakhapatnam – 530 003,
Andhra Pradesh, India.

ఈమెయిల్‌: facultyrecruit2020aug@iimv.ac.in

Notification

Application

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Thursday, August 27, 2020

Gold Rate Today: షాకిచ్చిన బంగారం.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రెట్లివే!

 



గత కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం (ఆగస్టు 28) షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. ఒకపక్క బంగారం ధరలు పెరిగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. 

దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.750 రూపాయలు పెరిగి.. రూ.50,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 రూపాయలు పెరగడంతో.. రూ.55,200 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరల విషయానికొస్తే.. గత ట్రేడింగ్‌లో రూ.50 పెరిగిన వెండి ధర రూ.50 రూపాయల తగ్గింది. దీంతో వెండి ధర కిలోకు రూ.65,500 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 560 రూపాయలు పెరిగి రూ.49,750 వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 610 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో రూ.53,660 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 560 రూపాయలు పెరిగి 49,750 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 610 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,660 రూపాయల వద్ద నిలిచింది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1935 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.24 శాతం పెరుగుదలతో 27.09 డాలర్లకు చేరింది.


BEL Jobs: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

 

భార‌త ప్రభుత్వ ర‌క్షణ మంత్రిత్వశాఖ‌ ఆధ్వర్యంలోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ వివిధ ఉద్యోగాల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఖాళీల సంఖ్య: 18

  • ట్రైనీ ఇంజినీర్‌/ఆఫీస‌ర్‌: 11

  • ప్రాజెక్ట్ ఇంజినీర్‌/ఆఫీస‌ర్‌: 07

విభాగాలు: ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, సివిల్‌, ఫైనాన్స్‌, హెచ్ఆర్‌.

అర్హత‌: బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అనుభ‌వం తప్పసరిగా ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కులు, గ‌త అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ఈమెయిల్‌: contengr-1@bel.co.in

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.09.2020.

చిరునామా: Sr. Dy. General Manager (HR&A),
Bharat Electronics Limited, N.D.A.Road,
Pashan, Pune- 411021.


Application form

SC/ST  Certificate format

Other Backward Class Certificate format

EWS Certificate format

PWD Certificate format

Format for providing information (To be uploaded in excel only)

Job Opportunities: ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..

 



Accenture Invites applications for the recruitment of Developer Posts


Accenture - జేఎస్ డెవలపర్ ఉద్యోగాలు

పుణేలోని యాక్సెంచర్ సంస్థ జేఎస్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..

* జేఎస్ డెవలపర్ 

అర్హత: ఏదైనా డిగ్రీ. 

అనుభవం: ఫ్రెషర్స్.

పనిప్రదేశం: పుణే.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


Tags: Accenture, Accenture Jobs, Accenture Recruitment, Private Jobs, IT Jobs, Software Jobs 


Morgan Stanley Invites applications for the recruitment of Automation Test Engineer Posts

Morgan Stanley - ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

బెంగళూరులోని మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు 
కోరుతోంది.

వివరాలు..

* ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ 

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 

అనుభవం: ఫ్రెషర్స్.

పనిప్రదేశం: బెంగళూరు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.



Tags: Morgan Stanley , Morgan Stanley  Jobs, Morgan Stanley  Recruitment, Private Jobs, IT Jobs, Software Jobs 


Amdocs Invites applications for the recruitment of Java Developer Posts

Amdocs - జావా డెవలపర్ ఉద్యోగాలు

పుణేలోని ఆమ్స్ డాక్స్ సంస్థ జావా డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* జావా డెవలపర్ 

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 

అనుభవం: 1 - 6 సంవత్సరాలు.

పనిప్రదేశం: పుణే. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.



Tags: Amdocs, Amdocs Jobs, Amdocs Recruitment, Private Jobs, IT Jobs, Software Jobs 


CGI Invites applications for the recruitment of Software Engineer Posts

CGI - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని సీజీఐ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 

అర్హత: BE/B.Tech/M.Tech/MS

అనుభవం: 2 - 4 సంవత్సరాలు.

స్కిల్స్: COBOL, JCL, DB2, VSAM, CICS

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.



Tags: CGI , CGI  Jobs, CGI  Recruitment, Private Jobs, IT Jobs, Software Jobs 


Fingent Invites applications for the recruitment of Software Engineer Posts

Fingent - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు

కోచ్చిలోని ఫింజెంట్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: 3 - 6 సంవత్సరాలు.

పనిప్రదేశం: కొచ్చిన్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.



Tags: Fingent , Fingent  Jobs, Fingent  Recruitment, Private Jobs, IT Jobs, Software Jobs 

Wednesday, August 26, 2020

NEET 2020 Admit Card వచ్చేసింది.. డౌన్‌లోడ్ చేస్కోండి



దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ -2020 పరీక్ష హాల్‌టిక్కెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేదీ, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షను దేశవ్యాప్తంగా సెప్టెంబరు 13న నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష కోసం 15,97,433 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నీట్ 2020 పరీక్ష ద్వారా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కింద నిర్వహించబడుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల భర్తీ చేస్తారు.

 Read Also: JEE Main పరీక్షకు హాజరవుతున్నారా? ఇవి తెలుసుకోండి!

 నీట్ ఎంట్రన్స్ పరీక్షను సెప్టెంబరు 13న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 155 నగరాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షను ఇంగ్లీష్‌తో పాటు హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు.

హాల్‌టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

  • అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.in లోకి వెళ్లాలి.
  • అక్కడ హోంపేజీలో ‘Download Admit Card’ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత అభ్యర్థులు అక్కడ తమ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, పిన్ వివరాలను నమోదుచేయాలి.
  • వివరాలు నమోదుచేయగానే ‘SUBMIT’ బటన్‌పై క్లిక్ చేయాలి.
  •  క్లిక్ చేయగానే వెంటనే నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ 2020 వస్తుంది.
  •  అడ్మిట్ కార్డును పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి.

NEET (UG) – 2020 Admit Cards – Download Here

JEE Main Admit Cards – Download Here

Monday, August 24, 2020

Motorola నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ .. ధరెంతో తెలుసా!


ప్రముఖ మొబైల్ తయారీదారు మోటొరోలా అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటో జీ9 పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది.

మోటొరోలా నుంచి ఇటీవల వచ్చిన ‘Moto G8కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మోటో జీ8 తరహాలోనే ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. 20W ఫాస్ట్ చార్జింగ్, 6.5 అంగుళాల డిస్ ప్లే వంటి ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. రెడ్ మీ నోట్ 9 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం21, రియల్ మీ 6ఐలకు ఈ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది.

ధర ఎంతంటే?
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.11,499గా నిర్ణయించారు. ఫారెస్ట్ గ్రీన్, సఫైర్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీనికి సంబంధించిన మొదటి సేల్ ఫ్లిప్ కార్ట్ లో ఆగస్టు 31వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

స్పెసిఫికేషన్లు..

➥ ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్ డీ+ మ్యాక్స్ విజన్ టీఎఫ్ టీ డిస్ ప్లేను అందించారు.

➥ డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20 : 9గా ఉండగా, స్క్రీన్ టు బాడీ రేషియో 87 శాతంగా ఉంది.

 ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో ఇచ్చారు.

➥ మందం-0.91 సెంటీమీటర్లు, బరువు-200 గ్రాములు.

 ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్.

➥ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.

 4 జీబీ ర్యామ్.

➥ 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

 ట్రిపుల్ బ్యాక్ కెమెరా [48+2(డెప్త్ సెన్సార్)+2 (మాక్రో షూటర్) మెగాపిక్సెల్] ఫీచర్. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.

➥ ఆటో స్మైల్ క్యాప్చర్, హెచ్ డీఆర్, ఫేస్ బ్యూటీ, మాన్యువల్ మోడ్, రా ఫొటో అవుట్‌పుట్ ఫీచర్.

 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

➥ 20W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్

➥ యూఎస్ బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు.

 మరిన్ని టెక్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Sunday, August 23, 2020

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..

 

Ajatus invites applicationa for the recruitment of dotnet developer posts

Ajatus - డాట్‌నెట్ డెవలపర్ ఉద్యోగాలు

భువనేశ్వర్‌లోని అజాటస్ సంస్థ డాట్‌నెట్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* డాట్‌నెట్ డెవలపర్ ఉద్యోగాలు

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: ఫ్రెషర్స్/ఎక్స్‌పీరియన్స్

పనిప్రదేశం: భువనేశ్వర్. 

స్కిల్స్: C#, .NET 4.5+, ASP.NET MVC, WebAPIs, MSSQL,MySQL, RDBMS, HTML, JS, and CSS, jQuery, Angular 2+.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.



Evince Technologies invites applicationa for the recruitment of web designer posts

Evince Technologies - వెబ్‌ డిజైనర్ ఉద్యోగాలు

చెన్నైలోని ఎవిన్స్ టెక్నాలజీస్ సంస్థ వెబ్‌ డిజైనర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* వెబ్‌ డిజైనర్

అర్హత: ఏదైనా డిగ్రీ. 

అనుభవంఫ్రెషర్స్.

పనిప్రదేశం: భువనేశ్వర్.  

స్కిల్స్:  HTML+CSS, XHTML+CSS.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.


LetsVenture invites applicationa for the recruitment of IOS Developer posts

LetsVenture - ఐవోఎస్ డెవలపర్ ఉద్యోగాలు

బెంగళూరులోని లెట్స్ వెంచర్ సంస్థ ఐవోఎస్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఐవోఎస్ డెవలపర్ 

అర్హత: డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)

అనుభవం: 0 - 1 సంవత్సరాలు.

పనిప్రదేశం: బెంగళూరు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

Notification & Online application


Asteria Aerospace invites applicationa for the recruitment of Backend Engineer posts

Asteria Aerospace - బ్యాక్ ఎండ్ ఇంజినీర్ ఉద్యోగాలు

బెంగళూరులోని ఆస్టేరియా ఏరోస్పేస్ సంస్థ బ్యాక్ ఎండ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు...

* బ్యాక్ ఎండ్ ఇంజినీర్ 

అర్హత: BE/B.Tech/BSc/BA

అనుభవం: 1.5+ సంవత్సరాలు.

పనిప్రదేశం: బెంగళూరు. 

స్కిల్స్: Python, Go, Ruby, CSS3, HTML5, RESTful APIs, Django/Gin Framework, GIT, GitHub, Unit Testing, Linux/Unix based OS, Build Systems

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా. 

Notification & Online application



MetricFox invites applicationa for the recruitment of Content Writer posts

MetricFox - కంటెంట్ రైటర్ ఉద్యోగాలు

బెంగళూరులోని మెట్రిక్‌ఫోక్స్ సంస్థ కంటెంట్ రైటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* కంటెంట్ రైటర్ 

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 

అనుభవం: 3 - 9 సంవత్సరాలు.

పనిప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

Notification & Online application


TurboModus Private Limited invites applicationa for the recruitment of sight engineer or superviser posts

TurboModus - సైట్ ఇంజినీర్/సూపర్‌వైజర్ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని టర్బోమోడస్ సంస్థ సైట్ ఇంజినీర్/సూపర్‌వైజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సైట్ ఇంజినీర్/సూపర్‌వైజర్ 

అర్హత: బీటెక్ (సివిల్)/ఏదైనా డిగ్రీ.

అనుభవం: 0 - 5 సంవత్సరాలు.

పనిప్రదేశం: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

E-Mail

Website


PiZone InfoTech invites applicationa for the recruitment of Software Trainee posts

PiZone InfoTech - సాఫ్ట్‌వేర్ ట్రైనీ ఉద్యోగాలు

రాజస్థాన్‌లోని పైజోన్ ఇన్ఫోటెక్ సంస్థ సాఫ్ట్‌వేర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* సాఫ్ట్‌వేర్ ట్రైనీ

అర్హత: ఏదైనా డిగ్రీ. 

అనుభవం: ఫ్రెషర్స్.

పనిప్రదేశం: శ్రీగంగానగర్, రాజస్థాన్. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

Notification & Online application


Paper Plane invites applicationa for the recruitment of Visual Designer posts

Paper Plane  - ప్రొడక్షన్/విజువల్ డిజైనర్ ఉద్యోగాలు

ముంబయిలోని పేపర్ ప్లేన్ సంస్థ ప్రొడక్షన్/విజువల్ డిజైనర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ప్రొడక్షన్/విజువల్ డిజైనర్ 

అర్హత: డిగ్రీ/డిప్లొమా.

అనుభవం: 1 - 4 సంవత్సరాలు.

పనిప్రదేశం: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

Notification & Online application


Magneto IT Solutions invites applicationa for the recruitment of PHP Developer posts

Magneto IT Solutions - పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాలు

పుణేలోని మాగ్నటో ఐటీ సొల్యూషన్స్ సంస్థ పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* పీహెచ్‌పీ డెవలపర్

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఐటీ/సీఎస్). 

అనుభవం: 2 - 3 సంవత్సరాలు.

పనిప్రదేశం: పుణే.

స్కిల్స్: PHP 5.2/5.3 /5.4, SQL/My SQL , JavaScript/j Query (UI), Core PHP, HTML and CSS.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

Notification & Online application


Pelican invites applicationa for the recruitment of Cloud Technical Application Engineer posts

Pelican - క్లౌడ్ టెక్నికల్ అప్లికేషన్ ఇంజినీర్ ఉద్యోగాలు

ముంబయిలోని పెలికాన్ సంస్థ క్లౌడ్ టెక్నికల్ అప్లికేషన్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.. 

*  క్లౌడ్ టెక్నికల్ అప్లికేషన్ ఇంజినీర్

అర్హత: BE/B.Com/BSc.

అనుభవం: 3 - 4 సంవత్సరాలు.

పనిప్రదేశం: ముంబయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

Notification & Online application


Saturday, August 22, 2020

TS POLYCET - 2020 ‌తేదీ ఖరారు.. పరీక్ష ఎప్పుడంటే?

 

తెలంగాణలో పాలిసెట్ పరీక్ష నిర్వహణ తేదీని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఖరారుచేసింది. కరోనా పరిస్థితులు, హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడిన పాలిసెట్‌ను సెప్టెంబర్‌ 2న నిర్వహించాలని నిర్ణయించింది. 

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్‌ను జులై 1న నిర్వహించేందుకు అధికారులు గతంలో ఏర్పాట్లు చేశారు. కరోనా పరిస్థితులు, న్యాయస్థానం ఆదేశాలతో ఆ ప్రవేశపరీక్షను వాయిదా వేశారు. 

తాజాగా పాలిసెట్ పరీక్షను సెప్టెంబర్‌ 2న నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్య కార్యదర్శి శ్రీనాథ్‌ శనివారం (ఆగస్టు 22) ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. సెప్టెంబరు 2న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Tags: TS Polycet, TS POLYCET 2020 Exam Date, TS POLYCET 2020 - New Exam Date, తెలంగాణ పాలిసెట్, పాలిసెట్ పరీక్ష 

Friday, August 21, 2020

TS: ప్రవేశ పరీక్షల షెడ్యూలు వెల్లడి.. ఎంసెట్ ఎప్పుడంటే?


తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కరోనా హమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదాపడిన పలు ప్రవేశ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది.


ఈ మేరకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ ప్రకటనను విడుదల చేసింది. కొత్త షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగనుంది.

అదేవిధంగా.. జులై 31న టీఎస్‌ ఈసెట్‌; సెప్టెంబరు 21 నుంచి 24 వరకు పీజీఈసెట్‌; సెప్టెంబరు 28-29 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్); సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీల్లో ఐసెట్, అక్టోబరు 1, 3 తేదీల్లో ఎడ్‌సెట్; అక్టోబరు 4న లాసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యామండలి తెలిపింది.

Thursday, August 20, 2020

ECIL'లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు (చివరితేది: 30.08.2020)



హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..


* టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 350 పోస్టులు


జోన్లవారీగా ఖాళీలు: హైదరాబాద్(హెడ్ క్వార్టర్)-200, న్యూఢిల్లీ-40, బెంగళూరు-50, ముంబయి-40, కోల్‌కతా-20.


పోస్టుల కేటాయింపు: జనరల్-160, ఈడబ్ల్యూఎస్-16, ఓబీసీ-90, ఎస్సీ-58, ఎస్టీ-26.


అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తగిన అనుభ‌వం ఉండాలి.


వ‌య‌సు: 31.07.2020 నాటికి 30 సంవత్సరాలకు మించ‌కూడ‌దు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.


ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.08.2020.


* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 30.08.2020.

Note: నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


Tags: Electronics Corporation Of India, ECIL, ECIL Recruitment, Technical Officer, ఈసీఐఎల్, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా 

Wednesday, August 19, 2020

NRA: ఇకపై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒకటే పరీక్ష.. కేబినెట్ ఆమోదం


 * నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్‌ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం (ఆగస్టు 19) ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఎన్‌ఆర్‌ఏ ఒకే ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రస్తుతం నియామక పరీక్షలను యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ వంటి సంస్ధలు నిర్వహిస్తున్నాయి. ఈ నిర్ణయంతో అన్ని సంస్థలకు కలిపి ఒకటే పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 20 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఉద్యోగ నియామకానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నాయి.


ఆన్‌లైన్‌లో సీఈటీ..

సీఈటీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఐబీపీఎస్ కోసం సీఈటీ తొలి దశ పరీక్షలు నిర్వహిస్తుంది. సీఈటీని డిగ్రీ, పన్నెండు, పది తరగతులు ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా రాయవచ్చు. దేశవ్యాప్తంగా 117 జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Tuesday, August 18, 2020

సెప్టెంబరులోనే ప్రవేశ పరీక్షలు.. ఎంసెట్‌పై కీలక నిర్ణయం!


తెలంగాణలో ప్రవేశ పరీక్షలన్నీ సెప్టెంబరులోనే పూర్తికానున్నాయి. అయితే ఎడ్‌సెట్ పరీక్షను మాత్రం అక్టోబరులో నిర్వహించనున్నారు. 

షెడ్యూలు ప్రకారం.. ఆగ‌స్టు 31న ఈసెట్‌, సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

 సెప్టెంబరు 20-30 తేదీల మధ్య ఎంసెట్‌(అగ్రికల్చర్‌), ఐసెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఎడ్‌సెట్‌ పరీక్షను మాత్రం అక్టోబరు మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. 

జేఈఈ మెయిన్‌, నీట్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో హైకోర్టు సైతం ప్రవేశ పరీక్షలకు అభ్యంతరం చెప్పదని అధికారులు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు. 

గతంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 5 విడతలు.. అగ్రికల్చర్‌కు మూడు విడతల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగేవి. కరోనా నేపథ్యంలో ఇంజినీరింగ్‌ పరీక్షను రోజుకు రెండు విడతల చొప్పున నాలుగు రోజులు, అగ్రికల్చర్‌ పరీక్షను రోజుకు రెండు విడతల్లో రెండు రోజులు నిర్వహించనున్నారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేల్లో 4499 ఉద్యోగాలు

 


నార్‌ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివరాలు..

* అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 4499

విభాగాలు: మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్&ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, లైన్‌మ్యాన్, ఐటీ & ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, మాసన్, కార్పెంటర్, పెయింటర్,

అర్హత: 50 శాతం మార్కులతో 10వ తరగతితో పాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి: 01.01.2020 నాటికి 15 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 13.08.2020

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.08.2020.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.09.2020.

Notification

Online Application

Website

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..