దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ -2020 పరీక్ష హాల్‌టిక్కెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, పుట్టినతేదీ, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షను దేశవ్యాప్తంగా సెప్టెంబరు 13న నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష కోసం 15,97,433 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నీట్ 2020 పరీక్ష ద్వారా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కింద నిర్వహించబడుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల భర్తీ చేస్తారు.
Read Also: JEE Main పరీక్షకు హాజరవుతున్నారా? ఇవి తెలుసుకోండి!
నీట్ ఎంట్రన్స్ పరీక్షను సెప్టెంబరు 13న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 155 నగరాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షను ఇంగ్లీష్‌తో పాటు హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ntaneet.nic.in లోకి వెళ్లాలి.
- అక్కడ హోంపేజీలో ‘Download Admit Card’ లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత అభ్యర్థులు అక్కడ తమ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, పిన్ వివరాలను నమోదుచేయాలి.
- వివరాలు నమోదుచేయగానే ‘SUBMIT’ బటన్‌పై క్లిక్ చేయాలి.
- క్లిక్ చేయగానే వెంటనే నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ 2020 వస్తుంది.
- అడ్మిట్ కార్డును పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి.
NEET (UG) – 2020 Admit Cards – Download Here
JEE Main Admit Cards – Download Here
No comments:
Post a Comment