కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి సంబంధించి వివిధ జాతీయస్థాయి ఉద్యోగ పరీక్షలు, నోటిఫికేషన్ల జారీ తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. మొత్తం 23 పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించింది. పరీక్షల క్యాలెండర్ను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
దీనిప్రకారం.. వచ్చే ఏడాది జూన్ 27న సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష(ప్రిలిమ్స్), సెప్టెంబరు 17 నుంచి అయిదు రోజులపాటు ప్రధాన పరీక్ష(మెయిన్) జరుపుతామని యూపీఎస్సీ ప్రకటించింది.
ఇక ఈ ఏడాది నిర్వహించాల్సి ఉన్న పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను వచ్చే ఏడాది నిర్వహించనుంది. ఈ మేరకు సవరించిన క్యాలెండర్ను యూపీఎస్సీ వెల్లడించింది.
దీనిప్రకారం సివిల్స్-2020 మెయిన్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8, 9, 10, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక వాయిదా పడిన సివిల్స్-2020 ప్రిలిమ్స్ అక్టోబరు 4న జరగనుంది.
అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్-2020 ప్రధాన పరీక్షలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు.
2021 పరీక్షల క్యాలెండర్..
2020 సవరించిన పరీక్షల క్యాలెండర్..
No comments:
Post a Comment