విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీహెచ్డీ అర్హతతోపాటు తగు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు…
* టీచింగ్ ఫ్యాకల్టీలు
- అసోసియేట్ ప్రొఫెసర్
- అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: డెసిషన్ సైన్సెస్; ఎకనామిక్స్ & సోషల్ సైన్సెస్; ఎంటర్ ప్రెన్యూయర్షిప్; ఫైనాన్స్ & అకౌంటింగ్; ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్; మేనేజ్మెంట్ కమ్యూనికేషన్; మార్కెటింగ్; ఆర్గనైజేషనల్ బిహేవియర్ & హెచ్ఆర్ఎం; ప్రొడక్షన్ & ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీ.
అర్హత: పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తును స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రింట్ కాపీతోపాటు ఇతర సర్టిఫికేట్లను అటెస్టేషన్ చేయించి సంబంధిత చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులకు చివరి తేది: 28.09.2020.
దరఖాస్తు హార్డ్ కాపీలు చేరడానికి చివరితేది: 17.10.2020.
ఈమెయిల్: facultyrecruit2020aug@iimv.ac.in
No comments:
Post a Comment