ప్రముఖ మొబైల్ తయారీదారు మోటొరోలా అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటో జీ9 పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
మోటొరోలా నుంచి ఇటీవల వచ్చిన ‘Moto G8కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మోటో జీ8 తరహాలోనే ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. 20W ఫాస్ట్ చార్జింగ్, 6.5 అంగుళాల డిస్ ప్లే వంటి ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. రెడ్ మీ నోట్ 9 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం21, రియల్ మీ 6ఐలకు ఈ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది.
ధర ఎంతంటే?
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.11,499గా నిర్ణయించారు. ఫారెస్ట్ గ్రీన్, సఫైర్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీనికి సంబంధించిన మొదటి సేల్ ఫ్లిప్ కార్ట్ లో ఆగస్టు 31వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
స్పెసిఫికేషన్లు..
➥ ఈ స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్ డీ+ మ్యాక్స్ విజన్ టీఎఫ్ టీ డిస్ ప్లేను అందించారు.
➥ డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20 : 9గా ఉండగా, స్క్రీన్ టు బాడీ రేషియో 87 శాతంగా ఉంది.
➥ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో ఇచ్చారు.
➥ మందం-0.91 సెంటీమీటర్లు, బరువు-200 గ్రాములు.
➥ ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్.
➥ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.
➥ 4 జీబీ ర్యామ్.
➥ 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
➥ ట్రిపుల్ బ్యాక్ కెమెరా [48+2(డెప్త్ సెన్సార్)+2 (మాక్రో షూటర్) మెగాపిక్సెల్] ఫీచర్. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.
➥ ఆటో స్మైల్ క్యాప్చర్, హెచ్ డీఆర్, ఫేస్ బ్యూటీ, మాన్యువల్ మోడ్, రా ఫొటో అవుట్‌పుట్ ఫీచర్.
➥ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
➥ 20W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
➥ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్
➥ యూఎస్ బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు.
No comments:
Post a Comment