Tuesday, August 18, 2020

సెప్టెంబరులోనే ప్రవేశ పరీక్షలు.. ఎంసెట్‌పై కీలక నిర్ణయం!


తెలంగాణలో ప్రవేశ పరీక్షలన్నీ సెప్టెంబరులోనే పూర్తికానున్నాయి. అయితే ఎడ్‌సెట్ పరీక్షను మాత్రం అక్టోబరులో నిర్వహించనున్నారు. 

షెడ్యూలు ప్రకారం.. ఆగ‌స్టు 31న ఈసెట్‌, సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

 సెప్టెంబరు 20-30 తేదీల మధ్య ఎంసెట్‌(అగ్రికల్చర్‌), ఐసెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఎడ్‌సెట్‌ పరీక్షను మాత్రం అక్టోబరు మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. 

జేఈఈ మెయిన్‌, నీట్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో హైకోర్టు సైతం ప్రవేశ పరీక్షలకు అభ్యంతరం చెప్పదని అధికారులు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు. 

గతంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 5 విడతలు.. అగ్రికల్చర్‌కు మూడు విడతల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగేవి. కరోనా నేపథ్యంలో ఇంజినీరింగ్‌ పరీక్షను రోజుకు రెండు విడతల చొప్పున నాలుగు రోజులు, అగ్రికల్చర్‌ పరీక్షను రోజుకు రెండు విడతల్లో రెండు రోజులు నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment