Thursday, August 27, 2020

Gold Rate Today: షాకిచ్చిన బంగారం.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రెట్లివే!

 



గత కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం (ఆగస్టు 28) షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. ఒకపక్క బంగారం ధరలు పెరిగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. 

దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.750 రూపాయలు పెరిగి.. రూ.50,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 రూపాయలు పెరగడంతో.. రూ.55,200 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరల విషయానికొస్తే.. గత ట్రేడింగ్‌లో రూ.50 పెరిగిన వెండి ధర రూ.50 రూపాయల తగ్గింది. దీంతో వెండి ధర కిలోకు రూ.65,500 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 560 రూపాయలు పెరిగి రూ.49,750 వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 610 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో రూ.53,660 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 560 రూపాయలు పెరిగి 49,750 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 610 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,660 రూపాయల వద్ద నిలిచింది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1935 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.24 శాతం పెరుగుదలతో 27.09 డాలర్లకు చేరింది.


No comments:

Post a Comment