తెలంగాణలో పాలిసెట్ పరీక్ష నిర్వహణ తేదీని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఖరారుచేసింది. కరోనా పరిస్థితులు, హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడిన పాలిసెట్ను సెప్టెంబర్ 2న నిర్వహించాలని నిర్ణయించింది.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ను జులై 1న నిర్వహించేందుకు అధికారులు గతంలో ఏర్పాట్లు చేశారు. కరోనా పరిస్థితులు, న్యాయస్థానం ఆదేశాలతో ఆ ప్రవేశపరీక్షను వాయిదా వేశారు.
తాజాగా పాలిసెట్ పరీక్షను సెప్టెంబర్ 2న నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్య కార్యదర్శి శ్రీనాథ్ శనివారం (ఆగస్టు 22) ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. సెప్టెంబరు 2న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Tags: TS Polycet, TS POLYCET 2020 Exam Date, TS POLYCET 2020 - New Exam Date, తెలంగాణ పాలిసెట్, పాలిసెట్ పరీక్ష
No comments:
Post a Comment