Friday, August 21, 2020

TS: ప్రవేశ పరీక్షల షెడ్యూలు వెల్లడి.. ఎంసెట్ ఎప్పుడంటే?


తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కరోనా హమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదాపడిన పలు ప్రవేశ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది.


ఈ మేరకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ ప్రకటనను విడుదల చేసింది. కొత్త షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగనుంది.

అదేవిధంగా.. జులై 31న టీఎస్‌ ఈసెట్‌; సెప్టెంబరు 21 నుంచి 24 వరకు పీజీఈసెట్‌; సెప్టెంబరు 28-29 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్); సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీల్లో ఐసెట్, అక్టోబరు 1, 3 తేదీల్లో ఎడ్‌సెట్; అక్టోబరు 4న లాసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యామండలి తెలిపింది.

No comments:

Post a Comment