Tuesday, September 29, 2020

AP EAMCET 2020 | కరోనాతో ఏపీ ఎంసెట్‌ రాయని వారికి మరో అవకాశంఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్‌-2020కు కరోనా సోకి హాజరు కాలేకపోయిన విద్యార్థులకు పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ఏపీ ఎంసెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూకే వీసీ ప్రొ.ఎం.రామలింగరాజు తెలిపారు.

ఇప్పటికే 20 మంది విద్యార్థులు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఆశ్రయించారన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే హెల్ప్‌లైన్‌ సెంటర్‌ helpdeskeamcet2020@gmail.com కి ఎంసెట్‌ హాల్‌టికెట్‌, కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టులను సెప్టెంబ‌రు 30 సాయంత్రం 5గంటల్లోగా పంపించాలని సూచించారు. వీరికి పరీక్ష నిర్వహించే తేదీని వెబ్‌సైట్ ద్వారా 
తెలియజేస్తామన్నారు.

https://sche.ap.gov.in/eamcet 


Monday, September 28, 2020

Gold Rates | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు


 
దేశంలో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.194 త‌గ్గి రూ.50,449కి చేరింది.

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డ‌మే దేశంలో బంగారం ధ‌ర త‌గ్గడానికి కార‌ణ‌మైంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేష‌కులు తెలిపారు. కాగా, గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.50,643 వ‌ద్ద ముగిసింది. 

దేశీయ మార్కెట్ల‌లో వెండి ధ‌ర‌లు కూడా స్వ‌ల్పంగా త‌గ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.933 త‌గ్గి రూ.59,274కు చేరింది.

 గ‌త ట్రేడ్‌లో వెండి 60,207 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1857 డాల‌ర్ల‌కు దిగివ‌చ్చింది. ఔన్స్ వెండి ధ‌ర కూడా 22.70 డాల‌ర్ల‌కు చేరింది.   

Friday, September 25, 2020

SP Balu: తిరిగిరాని లోకాలకు గాన గంధ‌ర్వుడు

 గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్రహ్మణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు.

త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారు. బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందు ధృవీకరించారు.

చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

సందర్శకుల కోసం చెన్నై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలుకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆగ‌స్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయ‌న మృతి చెంద‌డం ప‌ట్ల‌ ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. సోష‌ల్ మీడియాలో ప‌లువురు సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.

Tuesday, September 22, 2020

CPGET 2020: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 'సీపీగెట్'.. పూర్తి వివరాలు ఇలా.!

            

తెలంగాణలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(CPGET) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబరు 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తు చేసుకోవడానికి రూ.500 ఆలస్యరుసుముతో అక్టోబరు 26 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో అక్టోబరు 29 వరకు అవకాశం కల్పించారు. ఈ సారి CPGET పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. మొత్తం 46 సబ్జెక్టులలో పరీక్ష జరుగనుంది. పాత జిల్లాలో పరీక్షలు నిర్వహించనున్నారు. 


సీపీగెట్ వివరాలు..

* సీపీగెట్ (కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్) - 2020

సీట్ల సంఖ్య: 30,000

ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్ టీయూహెచ్‌ (ఎంఎస్సీ కోర్సు).

కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర సంప్రదాయ పీజీ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు కలిపి మొత్తం 60 కోర్సులు.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా.

దరఖాస్తు ఫీజు...

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్కో సబ్జెక్టుకు రూ.800 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. ఇతర సబ్జెక్టు కూడా రాయాలనుకునేవారు అదనంగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రాంరంభం: 18.09.2020

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.10.2020

* రూ.500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 26.10.2020

* రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 29.10.2020

* ప్రవేశ పరీక్ష తేదీ: 31.10. 2020 - 09.11.2020 వరకు.

Notification

Website   

Monday, September 21, 2020

GNM కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుకు 2 రోజులే గడువు!

 * ఏఎన్‌ఎం పూర్తి చేసిన వారికి అవకాశం

* కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎం)మూడు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర వైద్య విద్యా డైరెక్టరేట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఇదివరకే ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన వారికి, నేరుగా ఇదే కోర్సు చేసే వారికి అవకాశం కల్పించారు. జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వా రికి ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో ప్రాధాన్యముంటుంది. ఉన్నత వైద్య విద్యకు కూడా దోహదపడుతుంది. 

రాష్ట్రవ్యాప్తంగా 6 ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలున్నాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా నర్సింగ్‌ కళాశాలలో 62 (60 సీట్లు కొత్త వారికి, మరో 2 సీట్లు ఇన్‌సర్వీస్‌లో ఉన్నవారికి), గాంధీ ఆసుపత్రిలోని నర్సింగ్‌ పాఠశాలలో 62 సీట్లు, వరంగల్‌లోని ఎంజీఎం నర్సింగ్‌ పాఠశాలలో 62 సీట్లు, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని నర్సింగ్‌ పాఠశాలలో 27 సీట్లు, కరీంనగర్‌లోని నర్సింగ్‌ పాఠశాలలో 42 సీట్లు, నిజామాబాద్‌ నర్సింగ్‌ పాఠశాలలో 32 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

అర్హతలివే..!

వీటికి 40 శాతం ఇంటర్‌ మార్కులతో, తత్సమాన కో ర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్‌ సబ్జెక్టుల వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 2020 జూలై 1 నాటికి 16 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజ ర్వ్‌డ్‌ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తులను ఈనెల 24 లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్‌ కాపీలను పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు అందించాలి. 

ఉద్యోగావకాశాలు ఎక్కువే..!

ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు జీఎన్‌ఎం కోర్సులో చేరవచ్చు. కోర్సు  పూర్తి చేసినవారికి ప్రైవేట్‌, ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఇక్కడ చదివిన విద్యార్థినులు 60 శాతానికి పైగా మార్కులతోనే ఉత్తీర్ణులవుతున్నారు. కార్పొరేట్‌ దవాఖానాల్లో నెలకు రూ.20వేలకు పైగా వేతనంతో పని చేస్తున్నారు. ఇక్కడ మూడేళ్ల వ్యవధిలో పూర్తిస్థాయిలో థియరీ, ప్రాక్టికల్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నాం. విద్యార్థినులకు ప్రాక్టికల్స్‌కు దవాఖాన అందుబాటులో ఉండడంతో జీఎన్‌ఎం కోర్సు పూర్తవగానే ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

వెబ్‌సైట్

RRB NTPC Application Status | ఎన్టీపీసీ పోస్టుల అప్లికేషన్ స్టేటస్ వచ్చేసింది.. పరీక్ష ఎప్పుడంటే?


భారతీయ రైల్వేల్లో ఎన్టీపీసీ (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 15 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల కంటే ముందుగా.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఎన్టీపీసీ ‘అప్లికేషన్ స్టేటస్’ను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తును స్వీకరించారా లేదా రిజక్ట్ చేశారా అన్నది తెలుసుకోవచ్చు. 

దరఖాస్తులు సరిగ్గా ఉన్న అభ్యర్థులను మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. దరఖాస్తులు రిజక్ట్ అయిన అభ్యర్థులు.. అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాతే అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. అప్లికేషన్ స్టేటస్ సెప్టెంబరు 21 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాల ద్వారా అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.


అప్లికేషన్ స్టేటస్ వివరాల కోసం క్లిక్ చేయండి.. 


రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ రైల్వే జోన్ల పరిధిలో 35,277 నాన్‌టెక్నికల్ పాపులర్ కేటిగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 28న రైల్వేశాఖ నోటిఫికేషన్ వెల్లడించింది. అభ్యర్థుల నుంచి మార్చి 1 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది.

ఎన్టీపీసీ పోస్టులతో కలిపి మొత్తం 1,40,640 రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు కూడా డిసెంబరులోనే ప్రారంభంకానున్నాయి. వీటిలో ఎన్టీపీసీ, లెవల్-1 పోస్టులు, ఐసోలేటెడ్ & మినిస్టేరియల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. పరీక్షలకు 10 రోజుల మందుగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్టీపీసీ పోస్టుల రాతపరీక్ష విధానం…

మొత్తం 100 మార్కులకు ‘స్టేజ్-1’ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.

మొదటి విడత పరీక్షలో అర్హత సాధించిన వారికి ‘స్టేజ్-2’ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 మార్కులకు రెండో విడత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.

పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.

రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.


Saturday, September 19, 2020

APSET – 2020 పరీక్షతేదీ మార్పు.. దరఖాస్తు గడువు పెంపు!

 


* బీఎస్సీ చేసిన విద్యార్థులకూ అవకాశం

* ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఏఐసీటీఈ ఉత్తర్వులు

ఏపీలోని విశ్వవిద్యాల‌యాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల‌కు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీసెట్‌‌) పరీక్ష తేదీని అధికారులు ఖరారు చేశారు. డిసెంబరు 20న ఏపీసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఏపీసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే అక్టోబరు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 19 వరకు దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే అక్టోబరు 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఆలస్య రుసముతో నవంబరు 11 వరకు..
ఏపీసెట్‌కు దరఖాస్తుకు అపరాధ రుసుముతో కూడా అవకాశం కల్పించారు. రూ.1000 అపరాధ రుసుముతో అక్టోబరు 12 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో అక్టోబరు 21 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో నవంబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిసెంబరు 12 నుంచి హాల్‌టికెట్లు..
డిసెంబరు 20న నిర్వహించనున్న ఏపీసెట్ పరీక్ష హాల్‌టికెట్లను డిసెంబరు 12 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
వెబ్‌సైట్

Bank Jobs: SBI’లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. అర్హతలివే!


స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అక్టోబరు 8తో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.

పోస్టులవారీగా అభ్యర్థుల వయోపరిమితిని నిర్ణయించారు. అభ్యర్థులు 24-55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు..

* స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులు: 92

1) డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ): 28

అర్హత: డిగ్రీ.

అనుభవం: త్రివిధ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్‌/ పోలీస్ ఆఫీసర్ (ఏఎస్పీ/డిప్యూటీ ఎస్పీ) 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

2) మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్): 05

అర్హత: ఎంబీఏ/పీజీడీఎం లేదా బీఈ/బీటెక్‌తో పీజీ డిగ్రీ (మేనేజ్‌మెంట్) ఉండాలి.

అనుభవం: సంబంధిత రంగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.

Notification

Online Application

3) డేటా ట్రైనర్: 01

4) డేటా ట్రాన్స్‌లేటర్: 01

5) సీనియర్‌ కన్సల్టెంట్‌ అనలిస్ట్‌: 01

6) అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ETA): 01

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ.

అనుభవం: పోస్టులవారీగా 7 – 14 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Notification

Online Application

7) పోస్ట్-డాక్టోరల్ రిసెర్చ్ ఫెలోషిప్: 05

కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: పీహెచ్‌డీ (బ్యాంకింగ్/ఫైనాన్స్/ఎకనామిక్స్)

అనుభవం: సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.

Notification

Online Application

8) డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్: 01

అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.

అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 15 సంత్సరాల అనుభవం ఉండాలి.

Notification

Online Application

9) డిప్యూటీ మేనేజర్ (డేటా సైంటిస్ట్): 11

అర్హత: బీటెక్/ఎంటెక్/ఎంబీఏ/పీజీడీఎం.

అనుభవం: 3 సంవత్సరాలు.

10) మేనేజర్ (డేటా సైంటిస్ట్): 11

అర్హత: బీటెక్/ఎంటెక్/ఎంబీఏ/పీజీడీఎం.

అనుభవం: 5 సంవత్సరాలు.

11) డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్ ఆఫీసర్): 05

అర్హత: బీటెక్/ఎంటెక్.

అనుభవం: 3 సంవత్సరాలు.

Notification

Online Application

12) రిస్క్‌ స్పెషలిస్ట్‌: 19

13) పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌: 3

అర్హత: సీఏ/సీఎఫ్‌ఏ/ఎంబీఏ/పీజీడీఎం/ఎంఎస్సీ.

అనుభవం: పోస్టులవారీగా 2 – 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Notification

Online Application

Thursday, September 17, 2020

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాలకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూలు ఇదే!


 
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన షెడ్యూలును కూడా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ప్రైవేటు కళాశాలలకు మాత్రం ఇంటర్ బోర్డు భారీ షాకిచ్చింది. గుర్తింపు పొందిన విద్యాసంస్థల జాబితాలో ఒక్క ప్రైవేటు కళాశాల పేరునూ చేర్చకుండానే.. ప్రవేశాలకు పచ్చజెండా ఊపడం గమనార్హం. అంటే మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి ప్రైవేట్ కళాశాలలకు అనుమతి ఇవ్వడంలేదని బోర్డు చెప్పకనే చెప్పింది.

10 శాతం EWS కోటా అమలు..

ఈసారి ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(EWS) కోటా కింద 10 శాతం సీట్లను భర్తీ చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. కళాశాలలు మార్కుల మెమోల ఆధారంగా ప్రవేశాలు చేయవచ్చు. అమల్లో ఉన్న రిజర్వేషన్ల నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.

సీట్ల వివరాలు ఎప్పటికప్పుడు..

ప్రవేశాలకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను కూడా ఇంటర్ బోర్డు వెల్లడించింది. రిజర్వేషన్ ప్రక్రియ, తరగతిలో విద్యార్థుల సంఖ్య, సీట్ల వివరాల వెల్లడి తదితర అంశాలను పొందుపరిచింది. దీని ప్రకారం ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రతి సెక్షన్‌లో 88 కంటే ప్రవేశాలు మించరాదు. బోర్డు మంజూరు చేసిన సెక్షన్లు, నిండిన సీట్లు తదితర వివరాలను కళాశాలల ప్రధాన ద్వారం వద్ద అందరికీ కనిపించేలా ఏర్పాట్లు చేయాలి. మొదటి విడత ప్రవేశ ప్రక్రియ పూర్తికాగానే.. రెండో విడత ప్రవేశాల షెడ్యూలును ప్రకటిస్తారు.

ఇంటర్ ప్రవేశ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


 Website

ప్రవేశ షెడ్యూలు ఇలా..

* సెప్టెంబరు 16:  మొదటి విడత ప్రవేశాలు ప్రారంభం

* 18వ తేదీ:  ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం

* సెప్టెంబరు 30:  ప్రవేశాలకు తుది గడువు.
   

Wednesday, September 16, 2020

telangana vimochana dinam | సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవం


 

భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ.. తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం లభించనట్లే. అప్పటి నైజాం సంస్థానంలో మాత్రం ప్రజలకు నిజాం పాలకుల నుంచీ విముక్తి లభించలేదు. 

అప్పట్లో నిజాం సంస్థానం చాలా పెద్దది. తెలంగాణతోపాటూ... మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడ్డారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. 

బ్రిటీష్ పాలకులు స్వాతంత్య్రం ఇస్తూనే... సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే ఛాన్స్ వాటికే ఇచ్చారు. ఫలితంగా... మూడు సంస్థానాలు ఇండియాలో కలవలేదు. 

అవి: 1. కాశ్మీర్

          2. జునాఘడ్

           3. హైదరాబాద్ (నైజాం)

ఆ పరిస్థితుల్లో... ఉక్కుమనిషి... సర్దార్ వల్లభాయ్ పటేల్... ప్రత్యేక శ్రద్ధ పెట్టి... జునాఘడ్ సంస్థానాన్ని భారత్‌లో కలిసేలా చేశారు.

నైజాం నవాబ్ మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. అప్పట్లో రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ... మారణకాండకు తెగబడ్డారు. 

స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ... తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు.

 ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఏకమై ఎదురుతిరిగారు. ఎంతో మంది ఉద్యమ నేతలు, కళాకారులు... అందరూ తమ ప్రాణాలు పణంగా పెట్టారు. 

ఉద్యమం అత్యంత తీవ్ర స్థితికి చేరిన తర్వాత... కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. ఏం చేసైనా నిజాం సంస్థాన్ని ఇండియాలో కలిపేయమని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కి సూచించింది. అంతే... భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. 

దాంతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది. హైదరాబాద్ రేడియో ద్వారా... నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించాడు. ఆ రోజు... 1948 సెప్టెంబర్ 17. అందుకే ఇదే రోజును తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచన (స్వాతంత్య్ర) దినోత్సవంగా జరుపుకుంటున్నారు.


Gold Rate Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. వెండిదీ అదేదారి!


గత మూడురోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం (సెప్టెంబరు 17) కాస్త దిగొచ్చాయి. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ధరతో పోలిస్తే 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ధరతో పోలిస్తే 50 రూపాయలు తగ్గింది. దాంతో 54,980 రూపాయల వద్దకు చేరింది. 

బంగారంతోపాటు వెండి ధరలు కూడా కాస్త దిగొచ్చాయి. పారిశ్రామిక యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండి తగ్గడంతో వెండి ధర రూ.500 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.69,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధర దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు.. 
హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. గత ట్రేడింగ్‌తో పోలిస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గి 49,450కు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు రూ.70 తగ్గుదల నమోదు చేసింది. దీంతో రూ.53,950 వద్ద కొనసాగుతోంది.  

విజయవాడ, విశాఖపట్నంలలో.. 
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గి 49,450కు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు రూ.70 తగ్గుదల నమోదు చేసింది. దీంతో రూ.53,950 వద్ద కొనసాగుతోంది.  

అంతర్జాతీయంగానూ..
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గి 1965 డాలర్ల వద్ద ఉండగా.. వెండి ధర ఔన్స్‌కు 0.56 శాతం తగ్గుదలతో 27.32 డాలర్ల వద్ద కొనసాగుతోంది.   


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ..!

 


నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో త్వరలో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపట్టనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 

మొదటి మూడేండ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. 

కార్పొరేటర్‌, వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు సమాధానమిచ్చారు.


Read Also:   

RRB Group D CBT Date | 'గ్రూప్-డి' అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష ఎప్పుడంటే?

 


రైల్వేల్లో 'గ్రూప్-డి' పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రైల్వే శాఖ ఎట్టకేలకు గుడ్ న్యూస్ తెలిపింది. డిసెంబరు 15 నుంచి గ్రూప్-డి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు 10 రోజుల ముందుగా పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

దేశంలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలో లక్షకుపైగా 'గ్రూప్-డి' ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ గతేడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 12 నుంచి ఏప్రిల్ 12 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

వీరికి షెడ్యూలు ప్రకారం గతేడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. అనివార్యకారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈలోపు కరోనా బీభత్సం కారణంగా మరికొంత కాలం వాయిదాపడింది.

 లాక్‌డౌన్ నిబంధనలు తొలగించడంతో.. దేశంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. రైల్వే శాఖ కూడా నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయింది. ఈ మేరకు తాజా షెడ్యూలును విడుదల చేసింది. 

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..Read Also:   


RRB NTPC CBT Exam Date 2020 | RRB NTPC 'స్టేజ్-1' పరీక్ష తేదీ వెల్లడి.. అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడంటే?

  

* డిసెంబరు 15న సీబీటీ నిర్వహణ

* సెప్టెంబరు 21 నుంచి 31 వరకు అభ్యర్థుల 'అప్లికేషన్ స్టేటస్'

భారతీయ రైల్వేల్లో ఎన్టీపీసీ (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరులో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే రైల్వే శాఖ తాజాగా పరీక్ష తేదీని ప్రకటించింది. డిసెంబరు 15 నుంచి 'స్టేజ్-1' కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 

పరీక్ష తేదీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

అయితే అంతకు ముందగా అభ్యర్థుల అప్లికేషన్ స్టేటస్ వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. సెప్టెంబరు 21 నుంచి 30 వరకు 'అప్లికేషన్ స్టేటస్' అందుబాటులో ఉండనుంది. పరీక్షలకు 10 రోజుల మందుగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

అప్లికేషన్ స్టేటస్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ రైల్వే జోన్ల పరిధిలో 35,277 నాన్‌టెక్నికల్ పాపులర్ కేటిగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 28న రైల్వేశాఖ నోటిఫికేషన్ వెల్లడించింది. అభ్యర్థుల నుంచి మార్చి 1 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. 


అప్లికేషన్ స్టేటస్..?

పరీక్ష తేదీల వెల్లడి కంటే ముందుగా.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఎన్టీపీసీ ‘అప్లికేషన్ స్టేటస్’ను అందుబాటులో ఉంచనుంది. దీని ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తును స్వీకరించారా లేదా రిజక్ట్ చేశారా అన్నది తెలుసుకోవచ్చు. దరఖాస్తులు సరిగ్గా ఉన్న అభ్యర్థులను మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. దరఖాస్తులు రిజక్ట్ అయిన అభ్యర్థులు.. అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాతే అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు.


ఎన్టీపీసీ పోస్టుల రాతపరీక్ష విధానం…

మొత్తం 100 మార్కులకు ‘స్టేజ్-1’ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.

మొదటి విడత పరీక్షలో అర్హత సాధించిన వారికి ‘స్టేజ్-2’ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 మార్కులకు రెండో విడత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.

పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.

రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.


RRB NTPC 2019 Notification


   


AP EAMCET Examination - Engineering Stream: రేపటి నుంచే ఏపీ ఎంసెట్ ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ!


ఏపీలో ఎంసెట్ పరీక్షలు సెప్టెంబరు 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షల కోసం ఏపీ, తెలంగాణలో కలిపి 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంజినీరింగ్‌కు 1,85,263 మంది; వ్యవసాయ, మెడికల్ స్ట్రీమ్‌కు 87,637 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

విద్యార్థులు పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఎంసెట్‌లో ‘నిమిషం’ నిబంధనను అమలు చేస్తున్న కారణంగా.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. విద్యార్థులను గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రం ఆవరణలోకి అనుమతిస్తారు. 

షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబరు 17, 18, 21, 22, 23 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా సెప్టెంబరు 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ విభాగపు పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు కొవిడ్‌-19 స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని, దాన్ని పూరించి, పరీక్ష కేంద్రం వద్ద సమర్పించాలి. పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఇవి గమనించండి..

*  హాల్‌టికెట్‌పై ఉన్న బార్‌కోడ్‌ను సిబ్బంది స్కాన్‌ చేసి, కంప్యూటర్‌ ల్యాబ్‌కు దారి చూపిస్తారు.

*  పరీక్షకు 15 నిమిషాల ముందు మాత్రమే కంప్యూటర్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు.

*  పరీక్షలో ఎలాంటి నెగెటివ్‌ మార్కులు లేవు. కాబట్టి  విద్యార్థులు తమ సమాధానాలను పరీక్ష ముగిసేలోపు ఎప్పుడైనా మార్చుకోవచ్చు.

*  కంప్యూటర్‌లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే ఇన్విజిలేటర్‌కు సమాచారం అందించాలి. మరో కంప్యూటర్‌ ఏర్పాటు చేస్తారు. పరీక్ష ఎక్కడ నిలిచిపోతే.. అక్కడినుంచి సమయం ప్రారంభమవుతుంది.