Tuesday, September 29, 2020

AP EAMCET 2020 | కరోనాతో ఏపీ ఎంసెట్‌ రాయని వారికి మరో అవకాశం



ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్‌-2020కు కరోనా సోకి హాజరు కాలేకపోయిన విద్యార్థులకు పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ఏపీ ఎంసెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూకే వీసీ ప్రొ.ఎం.రామలింగరాజు తెలిపారు.

ఇప్పటికే 20 మంది విద్యార్థులు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఆశ్రయించారన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే హెల్ప్‌లైన్‌ సెంటర్‌ helpdeskeamcet2020@gmail.com కి ఎంసెట్‌ హాల్‌టికెట్‌, కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టులను సెప్టెంబ‌రు 30 సాయంత్రం 5గంటల్లోగా పంపించాలని సూచించారు. వీరికి పరీక్ష నిర్వహించే తేదీని వెబ్‌సైట్ ద్వారా 
తెలియజేస్తామన్నారు.

https://sche.ap.gov.in/eamcet 


No comments:

Post a Comment