* ఏఎన్ఎం పూర్తి చేసిన వారికి అవకాశం
* కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం)మూడు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర వైద్య విద్యా డైరెక్టరేట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇదివరకే ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి, నేరుగా ఇదే కోర్సు చేసే వారికి అవకాశం కల్పించారు. జీఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వా రికి ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ప్రాధాన్యముంటుంది. ఉన్నత వైద్య విద్యకు కూడా దోహదపడుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 6 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలున్నాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా నర్సింగ్ కళాశాలలో 62 (60 సీట్లు కొత్త వారికి, మరో 2 సీట్లు ఇన్‌సర్వీస్‌లో ఉన్నవారికి), గాంధీ ఆసుపత్రిలోని నర్సింగ్ పాఠశాలలో 62 సీట్లు, వరంగల్‌లోని ఎంజీఎం నర్సింగ్ పాఠశాలలో 62 సీట్లు, నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నర్సింగ్ పాఠశాలలో 27 సీట్లు, కరీంనగర్‌లోని నర్సింగ్ పాఠశాలలో 42 సీట్లు, నిజామాబాద్ నర్సింగ్ పాఠశాలలో 32 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలివే..!
వీటికి 40 శాతం ఇంటర్ మార్కులతో, తత్సమాన కో ర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్ సబ్జెక్టుల వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 2020 జూలై 1 నాటికి 16 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజ ర్వ్డ్ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తులను ఈనెల 24 లోగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ కాపీలను పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు అందించాలి.
ఉద్యోగావకాశాలు ఎక్కువే..!
ఇంటర్ పూర్తయిన విద్యార్థులు జీఎన్ఎం కోర్సులో చేరవచ్చు. కోర్సు పూర్తి చేసినవారికి ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఇక్కడ చదివిన విద్యార్థినులు 60 శాతానికి పైగా మార్కులతోనే ఉత్తీర్ణులవుతున్నారు. కార్పొరేట్ దవాఖానాల్లో నెలకు రూ.20వేలకు పైగా వేతనంతో పని చేస్తున్నారు. ఇక్కడ మూడేళ్ల వ్యవధిలో పూర్తిస్థాయిలో థియరీ, ప్రాక్టికల్ క్లాస్‌లు నిర్వహిస్తున్నాం. విద్యార్థినులకు ప్రాక్టికల్స్‌కు దవాఖాన అందుబాటులో ఉండడంతో జీఎన్ఎం కోర్సు పూర్తవగానే ఉద్యోగాలు లభిస్తున్నాయి.
No comments:
Post a Comment