రైల్వేల్లో 'గ్రూప్-డి' పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రైల్వే శాఖ ఎట్టకేలకు గుడ్ న్యూస్ తెలిపింది. డిసెంబరు 15 నుంచి గ్రూప్-డి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు 10 రోజుల ముందుగా పరీక్ష హాల్టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
దేశంలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలో లక్షకుపైగా 'గ్రూప్-డి' ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ గతేడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 12 నుంచి ఏప్రిల్ 12 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
వీరికి షెడ్యూలు ప్రకారం గతేడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. అనివార్యకారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈలోపు కరోనా బీభత్సం కారణంగా మరికొంత కాలం వాయిదాపడింది.
లాక్డౌన్ నిబంధనలు తొలగించడంతో.. దేశంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. రైల్వే శాఖ కూడా నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయింది. ఈ మేరకు తాజా షెడ్యూలును విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Read Also:
No comments:
Post a Comment