భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ.. తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం లభించనట్లే. అప్పటి నైజాం సంస్థానంలో మాత్రం ప్రజలకు నిజాం పాలకుల నుంచీ విముక్తి లభించలేదు.
అప్పట్లో నిజాం సంస్థానం చాలా పెద్దది. తెలంగాణతోపాటూ... మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడ్డారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి.
బ్రిటీష్ పాలకులు స్వాతంత్య్రం ఇస్తూనే... సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే ఛాన్స్ వాటికే ఇచ్చారు. ఫలితంగా... మూడు సంస్థానాలు ఇండియాలో కలవలేదు.
అవి: 1. కాశ్మీర్
2. జునాఘడ్
3. హైదరాబాద్ (నైజాం)
ఆ పరిస్థితుల్లో... ఉక్కుమనిషి... సర్దార్ వల్లభాయ్ పటేల్... ప్రత్యేక శ్రద్ధ పెట్టి... జునాఘడ్ సంస్థానాన్ని భారత్‌లో కలిసేలా చేశారు.
నైజాం నవాబ్ మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. అప్పట్లో రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ... మారణకాండకు తెగబడ్డారు.
స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ... తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు.
ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఏకమై ఎదురుతిరిగారు. ఎంతో మంది ఉద్యమ నేతలు, కళాకారులు... అందరూ తమ ప్రాణాలు పణంగా పెట్టారు.
ఉద్యమం అత్యంత తీవ్ర స్థితికి చేరిన తర్వాత... కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. ఏం చేసైనా నిజాం సంస్థాన్ని ఇండియాలో కలిపేయమని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కి సూచించింది. అంతే... భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
దాంతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది. హైదరాబాద్ రేడియో ద్వారా... నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించాడు. ఆ రోజు... 1948 సెప్టెంబర్ 17. అందుకే ఇదే రోజును తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచన (స్వాతంత్య్ర) దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
Read Also:
No comments:
Post a Comment