ఆన్లైన్ ఆర్డర్లు గణనీయంగా పెరగడంతో కొత్తగా 1,00,000 నియామకాలు చేపట్టేందుకు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సిద్ధమైంది. కొత్త ఉద్యోగులు పార్ట్-టైమ్, పూర్తి సమయం విధుల్లో పనిచేయనున్నారు.
ప్యాకింగ్, షిప్పింగ్ల్లో తోడ్పాటు అందిస్తారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో వినియోగదారులు నిత్యావసరాలు, ఇతర వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి మొగ్గుచూపడంతో ఏప్రిల్- జూన్ మధ్య అమెజాన్ రికార్డు లాభం, ఆదాయాలను నమోదు చేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో 1,75,000 మందిని నియమించుకున్న సంస్థ, గత వారం కార్పొరేట్, టెక్ ఉద్యోగాలకు 33,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 100 కొత్త గోదాములు, ప్యాకేజ్ సార్టింగ్ కేంద్రాలు, ఇతర కేంద్రాల వద్ద కంపెనీకి ఉద్యోగుల కొరత ఉంది.
No comments:
Post a Comment