విద్యార్థులు పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఎంసెట్‌లో ‘నిమిషం’ నిబంధనను అమలు చేస్తున్న కారణంగా.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. విద్యార్థులను గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రం ఆవరణలోకి అనుమతిస్తారు.
షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబరు 17, 18, 21, 22, 23 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా సెప్టెంబరు 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ విభాగపు పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు కొవిడ్-19 స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని, దాన్ని పూరించి, పరీక్ష కేంద్రం వద్ద సమర్పించాలి. పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్‌ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఇవి గమనించండి..
* హాల్‌టికెట్‌పై ఉన్న బార్‌కోడ్‌ను సిబ్బంది స్కాన్ చేసి, కంప్యూటర్ ల్యాబ్‌కు దారి చూపిస్తారు.
* పరీక్షకు 15 నిమిషాల ముందు మాత్రమే కంప్యూటర్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు.
* పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. కాబట్టి విద్యార్థులు తమ సమాధానాలను పరీక్ష ముగిసేలోపు ఎప్పుడైనా మార్చుకోవచ్చు.
* కంప్యూటర్లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే ఇన్విజిలేటర్‌కు సమాచారం అందించాలి. మరో కంప్యూటర్ ఏర్పాటు చేస్తారు. పరీక్ష ఎక్కడ నిలిచిపోతే.. అక్కడినుంచి సమయం ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment