Friday, September 11, 2020

AP Grama sachivalayam Exam Hall Tickets Released | గ్రామ‘సచివాలయ’ పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయ్..

 

పీలో గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియామక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి సెప్టెంబరు 12 నుంచి హాల్‌టికెట్లు విడుదల చేయాల్సి ఉండగా.. ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబరు 11నే హాల్‌టికెట్లను అందుబాటులోకి తెచ్చారు.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 20 నుంచి 26 వరకు పరీక్షలు జరగనున్నాయని.. పరీక్షా కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొంది.

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

 పరీక్ష కేంద్రాల వివరాలు..

రాష్ట్రంలో 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

పరీక్షల నిర్వహణ కోసం దాదాపు 3 నుంచి 5 వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. అదేవిధంగా పరీక్షల నిర్వహణకు నియమించిన సిబ్బందికి సెప్టెంబ‌రు 7, 8, 16, 17 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

వాస్తవానికి ఆగష్టు రెండో వారంలోనే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను నిర్వహించాల్సిన ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

No comments:

Post a Comment