ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ మరోసారి 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్' ప్రకటించింది. సెప్టెంబర్ 18న ప్రారంభమై సెప్టెంబర్ 20 వరకు ఈ సేల్ కొనసాగుతుంది.
ఈ ప్రత్యేక సేల్‌లో మొబైళ్లు, టాబ్లెట్లు, టీవీ, యాక్సెసరీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా గ్యాడ్జెట్లపై అదిరిపోయే డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.
స్పెషల్ సేల్ సమయంలో కస్టమర్లు కొనుగోలు చేయదలచిన వస్తువులను కేవలం ఒక్క రూపాయితోనే ముందస్తు బుకింగ్ చేసుకునే గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో మాత్రమే ప్రీ-బుక్ ఆఫర్ వర్తిస్తుంది.
కార్డులు లేదా ఈఎంఐ ద్వారా చెల్లింపులు జరిపే ఎస్బీఐ కార్డు వినియోగదారులు తగ్గింపును కూడా పొందవచ్చు.
టీవీలు, అప్లయెన్సెస్ కొనుగోలు చేసే కస్టమర్ల కోసం నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ హోమ్ పేజీలోని ప్రీ-బుక్ స్టోర్‌లోకి వెళ్లి రూ.1 చెల్లించి ఆర్డర్‌ను చేసుకోవాలి. బకాయి మొత్తాన్ని సెప్టెంబర్ 18లోగా చెల్లించాలి.
No comments:
Post a Comment