* ప్రత్యక్షంగా 70 వేలు, పరోక్షంగా 50వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 70వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరో 50వేల మందికి ఉద్యోగాలు లభించే వీలుందని సంస్థ వెల్లడించింది.
అంటే మొత్తంగా 1.2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఫ్లిప్కార్ట్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో ఉద్యోగాల కొరత తీవ్రమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఫ్లిప్కార్ట్ నిరుద్యోగులకు ఈ తీపి కబురు వినిపించింది.
కొవిడ్-19 ప్రభావానికి తోడు రానున్న పండగ సీజన్లో ఆన్లైన్ కొనుగోళ్లకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో సంస్థ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమెజాన్ ‘ప్రైమ్ డే’కు పోటీగా ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ ఆన్లైన్ కొనుగోలు మేళాను ప్రకటించింది. ఈ అతి పెద్ద సేల్ అక్టోబర్ 17 నుంచి 22 వరకు కొనసాగనుంది.
No comments:
Post a Comment