Friday, September 11, 2020

Gold Price Today | మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు


బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. డిమాండ్ లేకపోవడంతో తగ్గుతున్న వెండి ధర నేడు ఓ మోస్తరుగా పెరిగింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.170 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,720 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,250కి చేరింది. 

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజా రూ.220 మేర బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,820కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,250 వద్ద ట్రేడ్ అవుతోంది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధర నేడు భారీగా పెరిగింది. తాజాగా రూ.660 మేర ధర పుంజుకుంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.68,560కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఈ ధర వద్ద మార్కెట్ అవుతుంది.

No comments:

Post a Comment