బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం (సెప్టెంబరు 15) స్వల్పంగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించింది. ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు తాజాగా రూ.150 మేర స్వల్పంగా ధర పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.54,540 వద్ద, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,000 వద్ద కొనసాగుతున్నాయి.
వెండి ధర కూడా ఓ మోస్తరుగా పెరిగింది. తాజాగా రూ.400 మేర ధర పెరగడంతో.. కిలో వెండి ధర రూ.68,300 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఇదే విధంగా ఉంది.
Also Read: BOI Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్‌లో బంగారం ధరలు..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో బంగారం ధర రూ.180 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,530కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.160 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,070 అయింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయలు పెరిగి 49,070 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,530 రూపాయలుగా నమోదు అయింది.
Also Read: PNB Jobs: పీఎన్బీలో 535 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 1966 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.42 శాతం పెరుగుదలతో 27.46 డాలర్లకు ఎగసింది.
No comments:
Post a Comment