Wednesday, September 2, 2020

IBPS Clerks: గుడ్ న్యూస్.. క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!!



ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లర్కు పోస్టుల భ‌ర్తీకి ‘కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) ఎగ్జామినేషన్-X’ నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) విడుద‌ల చేసింది.

దీనిద్వారా ఐబీపీఎస్ పరిధిలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొత్తం 1,557 క్లర్కు పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు 20 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌కు 10 పోస్టును కేటాయించారు.

వివరాలు…

* ఐబీపీఎస్ సీఆర్‌పీ క్లర్క్స్ (X)

పోస్టుల సంఖ్య: 1,557 (తెలంగాణ -20, ఆంధ్రప్రదేశ్-10)

ఐబీపీఎస్ పరిధిలోని బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెన‌రా బ్యాంక్‌, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ బ్యాంక్‌, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

అర్హత: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి. అభ్య‌ర్థి ఏ రాష్ట్రానికైతే ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నాడో ఆ రాష్ట్ర స్థానికభాషపై పట్టు ఉండాలి. మాట్లాడటంతోపాటు చదవడం, రాయడం కూడా తెలిసి ఉండాలి.

వయసు: 01.09.2020 నాటికి 20 – 28 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. 02.09.1992- 01.09.2000 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ అభ్యర్థుల‌కు మాత్రం రూ.175 చెల్లించాలి.

ప‌రీక్ష విధానం: అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్ రాతపరీక్షలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మెయిన్ పరీక్షకు అర్హత సాధిస్తారు.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష..

మొత్తం 100 మార్కుల‌కు ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో ఇంగ్లిష్‌ – 30, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ – 35, రీజనింగ్ ఎబిలిటీ – 35 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ప‌రీక్ష స‌మ‌యం 60 నిమిషాలు.

మెయిన్ ప‌రీక్ష..
మెయిన్ ప‌రీక్షలో మొత్తం 190 ప్రశ్నల‌కు గాను 200 మార్కులు ఉంటాయి. ఇందులో జ‌న‌ర‌ల్‌/ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్‌-50 ప్రశ్నల‌కు 50 మార్కులు, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్- 40 ప్రశ్నల‌కు 40 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & కంప్యూట‌ర్ అప్టిట్యూడ్- 50 ప్రశ్నల‌కు 60 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 50 ప్రశ్నల‌కు 50 మార్కులు ఉంటాయి.  ప‌రీక్ష స‌మ‌యం 160 నిమిషాలు.

ప‌రీక్ష కేంద్రాలు..

ఆంధ్రప్రదేశ్విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం.
తెలంగాణహైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం.


ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ ప్రారంభం02.09.2020
✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపున‌కు చివరితేదీ23.09.2020
✦ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌ లెట‌ర్‌ డౌన్‌లోడ్‌17.11.2020 నుంచి
✦ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ప‌రీక్ష23.11.2020 – 28.11.2020
✦ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌ లెట‌ర్ డౌన్‌లోడ్‌18.11.2020 నుంచి
✦ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) తేదీ05.12.2020
12.12.2020
13.12.2020
✦ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) ఫ‌లితాలు31.12.2020
✦ మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్‌) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌12.01.2021
✦ మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్‌)24.01.2021
✦ ప్రొవిజినల్ అలాట్‌మెంట్‌01.04.2021

Notification

Online Application

Website

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

No comments:

Post a Comment