నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించిన ప్రవేశప్రకటన వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,492 సీట్లను భర్తీ చేయనున్నారు.
సెప్టెంబరు 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు అక్టోబరు 3 చివరితేదీగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాలు వచ్చినప్పటికీ.. గ్రేడ్లను ప్రకటించకపోవటంతో ఏపీ విద్యార్థులు పోటీపడే 15 శాతం సీట్ల భర్తీకి సంబంధించి సందిగ్ధత నెలకొంది.
అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని బాసర ఆర్జేయూకేటీ తెలిపింది. అక్టోబరు 20 వరకు ఏపీ ప్రభుత్వం గ్రేడ్లను ప్రకటిస్తే విద్యార్థులను ఎంపిక చేస్తామని విద్యాలయం ప్రకటించింది.
దరఖాస్తు ప్రక్రియకు ఏవైనా సందేహాలుంటే 9573001992, 9703760686 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సందేహాలను dmissions@rgukt.ac.in మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు.
దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ (AP/TS) అభ్యర్థులకు రూ.200; ఎస్సీ, ఎస్టీ (AP/TS) అభ్యర్థులకు రూ.150; ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు రూ.1000; ఎన్నారై/అంతర్జాతీయ అభ్యర్థులు రూ.25 డాలర్లు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.09.2020.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.10.2020.
No comments:
Post a Comment