తెలంగాణలో ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్ను తెలంగాణ ఇంటర్ బోర్డు గురువారం (సెప్టెంబరు 10) విడుదల చేసింది.
దీనిప్రకారం విద్యాసంవత్సరంలో మొత్తం 182 పనిదినాలు ఉండనున్నాయి. అయితే ఈసారి దసరాకు 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు.
వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 16తో విద్యాసంవత్సరం ముగియనుంది.
No comments:
Post a Comment