బంగారం ధరలు వరుసగా మూడోరొజు కూడా దూసుకుపోయాయి. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీ షాకిచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరగడంతో.. రూ.50,450 వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 రూపాయలు పైకెగసింది. దీంతో రూ.55,030 వద్ద కొనసాగుతోంది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా పైకి కదిలాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.1200 పెరుగుదల నమోదు చేసింది. దీంతో 69వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర రూ.69,500 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.49,520 చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.490 పెరగడంతో.. రూ.54,020 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలలోనూ బంగారం, వెండి ధరలు ఇదే విధంగా ఉన్నాయి.
No comments:
Post a Comment