తెలంగాణలో ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 11న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు16 నుంచి 23 వరకు సర్టిఫికేట్ల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 19 నుంచి 23 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఇక సెప్టెంబరు 19 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నవారికి సెప్టెంబరు 28న సీట్లు కేటాయిస్తారు.
Also Read: TS ECET 2020 ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసుకోండి..
తుది విడత కౌన్సెలింగ్ ఎప్పడంటే?
మొదటి విడత కౌన్సెలింగ్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 6 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులకు అక్టోబర్ 6, 7 తేదీల్లో తుది విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. అక్టోబర్ 9న సీట్లను కేటాయించనున్నారు. ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
Also Read: JEE Main పేపర్-1 ఫలితాలు విడుదల
ఈసెట్ ఫలితాల్లో 97.58శాతం మంది ఉత్తీర్ణత
కరోనాతో నెలకొన్న పరిస్థితుల అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా ఈసెట్ ప్రవేశపరీక్షనే నిర్వహించారు. కొవిడ్ -19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు 31న ఈసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో మొత్తం 97.58శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు16 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
No comments:
Post a Comment