Tuesday, October 27, 2020

TS EdCET Results 2020 | తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల


 తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌ ఎడ్‌సెట్‌)- 2020 ఫ‌లితాలు బుధవారం (అక్టోబర్ 28‌) విడుదలయ్యాయి. ఓయూ ప్రాంగణంలోని యూనివ‌ర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యూకేష‌న్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి  ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందబాటులో ఉంచారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ఎడ్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో 97.58 శాతం మంది విద్యార్థులు అర్హ‌త సాధించార‌ని ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఈ ఫ‌లితాల్లో అమ్మాయిలు 76.07 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల చేస్తామ‌న్నారు. 206 బీఈడీ కాలేజీల్లో 18 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయ‌ని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ అక్టోబర్‌ 1, 3 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 30,600 మంది అభ్యర్థులు ఈ ప‌రీక్షకు హాజ‌ర‌య్యారు. అభ్యర్థుల ర్యాంకుల ఆధారంగా కళాశాలలను కేటాయించనున్నారు. వాస్తవానికి అక్టోబరు 21న ఎడ్‌సెట్ ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా అక్టోబరు 28కి వాయిదా వేశారు.


No comments:

Post a Comment