Monday, October 12, 2020

CBSE 'క్లాస్-10' కంపార్ట్‌మెంట్ ఫ‌లితాలు విడుద‌ల‌


* 56.55 శాతం మంది ఉత్తీర్ణత

సీబీఎస్‌ఈ ప‌దోత‌ర‌గ‌తి కంపార్ట్‌మెంట్ ప‌రీక్షల ఫ‌లితాల‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ విడుద‌ల చేసింది. ఫలితాల్లో మొత్తం 56.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు.

ప‌రీక్షకు మొత్తం 1,57,866 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 1,49,726 మంది విద్యార్థులు ప‌రీక్షకు హాజ‌ర‌య్యారు. ఇందులో 82,903 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యార‌ని సీబీఎస్సీ ప్రక‌టించింది. ప‌రీక్ష రాసిన విద్యార్థులు ఫ‌లితాల‌ను వెబ్‌‌సైట్ ద్వారా చూసుకోవ‌చ్చు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

దేశ‌వ్యాప్తంగా 1248 కేంద్రాల్లో సెప్టెంబ‌ర్ 22 నుంచి 30 వ‌ర‌కు కంపార్ట్‌మెంట్ ప‌రీక్షలు జ‌రిగాయి. ఫ‌లితాల‌ను 12 రోజుల వ్యవధిలోనే విడుద‌ల చేశారు. కాగా, సీబీఎస్సీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను జూలై 15న ప్రకటించింది.

అందులో 91.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. అక్టోబరు 9న సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా 10వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలను వెల్లడించింది.

No comments:

Post a Comment