దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు సోమవారం(అక్టోబరు 5) విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఐఐటీ ఢిల్లీ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాలతోపాటు కటాఫ్ మార్కుల వివరాలను కూడా ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లో ఉన్న 13,600 సీట్లను భర్తీ చేయనున్నారు.
సెప్టెంబరు 27న దేశవ్యాప్తంగా 222 పట్టణాల్లో 1,001 కేంద్రాల్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలో 96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో పేపర్-1 పరీక్షకు 1,51,311 మంది విద్యార్థులు, పేపర్-2 పరీక్షకు 1,50,900 మంది విద్యార్థులు హాజరయ్యారు.
అక్టోబరు 6 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ
అక్టోబరు 6 నుంచి ప్రవేశ ప్రక్రియ (జోసా) ప్రారంభంకానుంది. నవంబర్ 13 వరకు మొత్తం ఆరు విడుతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అక్టోబరు 6 నుంచి కౌన్సెలింగ్ ఉంటుంది.
No comments:
Post a Comment