ఎంసెట్లో 75.29శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 89,734మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి (వెబ్సైట్-1)..
ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి (వెబ్సైట్-2)..
9 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ..
ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు అక్టోబరు 9 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 9 నుంచి 17 వరకు ఆన్లైన్లో స్లాట్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అక్టోబరు 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు అక్టోబరు 12 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 22న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.
అక్టోబరు 29 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనుంది. అక్టోబరు 30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. అక్టోబరు 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వీరికి నవంబర్ 2న సీట్లను కేటాయించనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కూడా మిగిలిన సీట్ల భర్తీకి నవంబరు 4న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.
No comments:
Post a Comment