తెలంగాణ (Telangana) లో మరో కీలక నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ -4 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం (అక్టోబరు 6) సాయంత్రం టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ ఈ ఫలితాలను విడుదల చేశారు.
2018లో 1,595 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. వాటికి సంబంధించిన ఫలితాలను టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం అధికారిక వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వాలి.
జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాల ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఇదిలాఉంటే.. ఈ గ్రూప్-4 నోటిఫికేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇదిలాఉంటే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్పటి వరకు 30,723 నియామకాలను చేపట్టినట్లు కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు.
No comments:
Post a Comment