Tuesday, November 24, 2020

Today Gold Rate | గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. బంగారం ధరలు దాదాపు రూ.1000 వరకు పతనం కాగా.. వెండి ధర ఏకంగా రూ.2000 పైగా తగ్గింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి.

పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 900 రూపాయల తగ్గుదల నమోదు చేసి రూ.46,200 రూపాయల వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.980 కిందికి దిగివచ్చింది. దీంతో రూ.50,400 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడంతో.. కిలో వెండి ధర రూ.2200 తగ్గింది. దీంతో వెండి ధర కిలోకు రూ.64,500 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో ఇలా..
మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 900 రూపాయలు తగ్గింది. దీంతో 48,250 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 980 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 52,630 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక ఢిల్లీలో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 2000 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 60,000 రూపాయల వద్దకు పడిపోయింది.

అంతర్జాతీయంగా ఇలా..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. మరోవైపు వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 1805 డాలర్లకు చేరగా.. వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం క్షీణించి 23.28 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Friday, November 6, 2020

TS LAWCET- 2020 Results Released | టీఎస్ లాసెట్ ఫ‌లితాలు విడుదల.. ఇక్కడ చూసుకోండి



TS LAWCET 2020 Result: తెలంగాణలోని లా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ లాసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ పాపిరెడ్డి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను ప్రక‌టించారు. లాసెట్‌తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల‌కోసం నిర్వహించిన పీజీఎల్‌సెట్ ఫ‌లితాలను కూడా విడుదల చేశారు. 
Official Website

లాసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

మూడేళ్ల లాసెట్‌లో 78.60 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఐదేళ్ల లాసెట్లో 62.35 శాతం, పీజీఎల్‌ సెట్‌లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. మూడేళ్ల లాసెట్‌లో సీహెచ్. స్నేహశ్రీ మొదటి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల లాసెట్‌లో ఎస్ఎస్‌కే. పాంచజన్య, పీజీఎల్‌సెట్‌లో  టి.ప్రవల్లి మొదటి ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.

కరోనా నిబంధనల మధ్య అక్టోబ‌ర్ 9న లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాల‌యం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30,310 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 21,559 మంది ప‌రీక్షకు హాజ‌ర‌య్యారు. లాసెట్ ప‌రీక్ష ద్వారా మూడేళ్ల ఎల్ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ ఆన‌ర్స్ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు.