బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. బంగారం ధరలు దాదాపు రూ.1000 వరకు పతనం కాగా.. వెండి ధర ఏకంగా రూ.2000 పైగా తగ్గింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి.
పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 900 రూపాయల తగ్గుదల నమోదు చేసి రూ.46,200 రూపాయల వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.980 కిందికి దిగివచ్చింది. దీంతో రూ.50,400 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడంతో.. కిలో వెండి ధర రూ.2200 తగ్గింది. దీంతో వెండి ధర కిలోకు రూ.64,500 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో ఇలా..
మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 900 రూపాయలు తగ్గింది. దీంతో 48,250 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 980 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 52,630 రూపాయల వద్దకు చేరుకుంది.
ఇక ఢిల్లీలో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 2000 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 60,000 రూపాయల వద్దకు పడిపోయింది.
అంతర్జాతీయంగా ఇలా..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. మరోవైపు వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 1805 డాలర్లకు చేరగా.. వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం క్షీణించి 23.28 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
No comments:
Post a Comment