TS LAWCET 2020 Result: తెలంగాణలోని లా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ లాసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ప్రకటించారు. లాసెట్తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన పీజీఎల్‌సెట్ ఫలితాలను కూడా విడుదల చేశారు.
Official Website
లాసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Official Website
లాసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
మూడేళ్ల లాసెట్‌లో 78.60 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఐదేళ్ల లాసెట్‌లో 62.35 శాతం, పీజీఎల్ సెట్లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. మూడేళ్ల లాసెట్‌లో సీహెచ్. స్నేహశ్రీ మొదటి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల లాసెట్‌లో ఎస్ఎస్కే. పాంచజన్య, పీజీఎల్‌సెట్‌లో టి.ప్రవల్లి మొదటి ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.
కరోనా నిబంధనల మధ్య అక్టోబర్ 9న లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30,310 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 21,559 మంది పరీక్షకు హాజరయ్యారు. లాసెట్ పరీక్ష ద్వారా మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
No comments:
Post a Comment