Wednesday, December 30, 2020

SSC CGL 2020 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 6 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ!

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2020' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు దశల్లో (టైర్-1,టైర్-2, టైర్-3, టైర్‌-4) అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వివరాలు..

* కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2020

మొత్తం ఖాళీలు: 6,506

1) గ్రూప్-బి గెజిటెడ్: 250

2) గ్రూప్-బి నాన్ గెజిటెడ్‌: 3513

3) గ్రూప్-సి: 2743

పోస్టులు..
➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్
➥ అసిస్టెంట్
➥ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
➥ ఇన్‌స్పెక్టర్ (పోస్టల్ శాఖ)
➥ ఇన్‌స్పెక్టర్ (నార్కోటిక్స్)
➥ అసిస్టెంట్ సూపరింటెండెంట్
➥ డివిజనల్ అకౌంటెంట్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/ CBN)
➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్
➥ ఆడిటర్
➥ అకౌంటెంట్
➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
➥ ట్యాక్స్ అసిస్టెంట్
➥ అప్పర్ డివిజన్ క్లర్క్

అర్హత: ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.01.2021 నాటికి కొన్ని పోస్టులకు 18-27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 30 - 32 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2, టైర్-3, టైర్-4 పరీక్షల ద్వారా.

పరీక్ష విధానం..

* టైర్‌-1: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌

* టైర్‌-2: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌

* టైర్‌-3: పెన్ అండ్ పేప‌ర్ విధానంలో(డిస్క్రిప్టివ్ పేప‌ర్‌)

* టైర్‌-4: క‌ంప్యూట‌ర్ ప్రోఫిషియ‌న్సీ టెస్ట్‌/ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్‌.

దర‌ఖాస్తు ఫీజు: ఇత‌రుల‌కు రూ.100, ఎస్సీ/ ఎస్టీ/ స్త్రీ/ దివ్యాంగులు/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్యర్థుల‌కు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

‣ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ: 29.12.2020 నుంచి 31.01.2021 వరకు.

‣ ఆన్‌లైన్ పేమెంట్ చెల్లింపున‌కు చివ‌రితేది: 02.02.2021.

‣ ఆఫ్‌లైన్ పేమెంట్ (చ‌లాన్ ద్వారా) చెల్లింపున‌కు చివరితేది: 04.02.2021.

‣ టైర్‌-1 ప‌రీక్ష ‌తేది: 29.05.2021 నుంచి 07.06.2021 వ‌ర‌కు.

‣ టైర్‌-2 ‌ప‌రీక్ష ‌తేది: వెల్లడించాల్సి ఉంది.




Website

Monday, December 21, 2020

APSWREIS Staff Nurses Recruitment | ఏపీలో స్టాఫ్ న‌ర్స్ పోస్టులు.. జీతమెంతంటే?

 


ఏపీ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌నల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ (APSWREIS) పాఠ‌శాలల్లో పార్ట్ టైం ప్రాతిప‌దిక‌న ప‌నిచేయ‌డానికి స్టాఫ్ట్ న‌ర్సు పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* స్టాఫ్ న‌ర్సు పోస్టులు

ఖాళీల సంఖ్య: 17

వ‌య‌సు: 20-35 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల‌కు వయోపరిమితిలో ఐదేళ్ల స‌డ‌లింపు వర్తిస్తుంది.

అర్హత‌: ఏపీ స్టేట్ న‌ర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిన సంస్థలు/ యూనివ‌ర్సిటీల నుంచి బీఎస్సీ(న‌ర్సింగ్‌) గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌తో పాటు రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. బీఎస్సీ(న‌ర్సింగ్‌) అభ్యర్థుల‌తో ఖాళీలు భ‌ర్తీకాని పక్షంలో ఏపీ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిన న‌ర్సింగ్ కాలేజ్‌/ యూనివ‌ర్సిటీ నుంచి జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీ(జీఎన్ఎం)కోర్సులో ఉత్తీర్ణత‌తో పాటు మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు సంబంధిత మెయిల్‌కు తమ రెజ్యూమ్‌లను పంపించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: వాక్ఇన్ టెస్ట్ అండ్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

షెడ్యూలు: 29.12.2020, ఉదయం 10 గం.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.12,900 (క‌న్సాలిడేటెడ్‌) చెల్లిస్తారు.

ప‌నిప్రదేశం: ఆధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న ఏపీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్ పాఠ‌శాలల్లో ప‌ని చేయాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎలాంటి ఫీజు లేదు.

ఈమెయిల్: apswreishealth@gmail.com

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 28.12.2020 సాయంత్రం 5 గంట‌ల లోపు పంపించాలి.


Notification

Website

INTELLIGENCE BUREAU RECRUITMENT 2020 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2000 ఖాళీలు


భార‌త ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జ‌న‌ర‌ల్ సెంట్రల్ స‌ర్వీస్ విభాగానికి చెందిన కింది గ్రూప్-సి (నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..


* అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ (ఏసీఐఓ) (గ్రేడ్‌-2)/ ఎగ్జిక్యూటివ్


ఖాళీల సంఖ్య: 2000


కేట‌గిరీల వారీగా ఖాళీలు..

అన్‌రిజ‌ర్వ్‌డ్ ‌ - 989

ఈడ‌బ్ల్యూఎస్‌ - 113

ఓబీసీ - 417

ఎస్సీ - 360

ఎస్టీ - 121


అర్హత‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ త‌త్సమాన ఉత్తీర్ణత‌.


వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం:  రాత ప‌రీక్ష(ఆన్‌లైన్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా.


ప‌రీక్షా విధానం: 

టైర్‌-1: ఆన్‌లైన్ ప‌ద్ధతిలో టైర్‌-1 ప‌రీక్ష ఉటుంది. దీనిని 100 మార్కుల‌కు ఆబ్జెక్టివ్ ప‌ద్ధతిలో నిర్వహిస్తారు. దీన్ని 5 విభాగాలుగా విభ‌జించి విభాగానికి 20 ప్రశ్నల చొప్పున(ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు) ఇస్తారు. ప‌రీక్షా స‌మ‌యం ఒక గంట‌. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌, న్యూమ‌రిక‌ల్‌/ అన‌లైటిక‌ల్‌/ లాజిక‌ల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జ‌న‌ర‌ల్ స్టడీస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

టైర్‌-2: డిస్క్రిప్టివ్ ప‌ద్ధతిలో టైర్‌-2 పరీక్ష ఉంటుంది. దీన్ని మొత్తం 50 మార్కుల‌కు నిర్వహిస్తారు. ఇందులో 30 మార్కుల‌కు ఎస్సై రైటింగ్ ఉంటుంది. మిగిలిన 20 మార్కుల‌కు ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ ప్రేజెస్ రైటింగ్ ఉంటాయి. దీనికి ప‌రిక్షా స‌మ‌యం ఒక గంట‌గా కేట‌యించారు.

టై‌ర్‌-3: ఇందులో ఇంట‌ర్వ్యూ ఉంటుంది. దీన్ని మొత్తం 100 మార్కుల‌కు నిర్వహిస్తారు.

* దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 


తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.

* అభ్యర్థులు గ‌రిష్ఠంగా మూడు ప‌రీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.12.2020

ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరితేది: 09.01.2021

SBI చలనా రూపంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2021


Notification


Online Application


WEBSITE

Sunday, December 6, 2020

Airports Authority of India Recruitment 2020 | ఏఏఐలో 368 మేనేజ‌ర్‌, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు


న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వివిద ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 368

1) మేనేజ‌ర్: 13

2) జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్: 355

విభాగాలు: ఫైర్ స‌ర్వీస్‌, టెక్నిక‌ల్‌, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌, ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్‌, టెక్నిక‌ల్‌.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, మేనేజ‌ర్ స్థాయి పోస్టులకు అనుభ‌వం అవ‌స‌రం, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులకు అనుభ‌వం అవ‌సరం లేదు.

వ‌య‌సు: 30.11.2020 నాటికి మేనేజ‌ర్‌-32 ఏళ్లు, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్/ ఇంట‌ర్వ్యూ/ ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్‌, ఎండ్యూరెన్స్ టెస్ట్‌/ డ్రైవింగ్ టెస్ట్‌/ వాయిస్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 15.12.2020.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.01.2021.


Notification