ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) పాఠశాలల్లో పార్ట్ టైం ప్రాతిపదికన పనిచేయడానికి స్టాఫ్ట్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* స్టాఫ్ నర్సు పోస్టులు
ఖాళీల సంఖ్య: 17
వయసు: 20-35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
అర్హత: ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన సంస్థలు/ యూనివర్సిటీల నుంచి బీఎస్సీ(నర్సింగ్) గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. బీఎస్సీ(నర్సింగ్) అభ్యర్థులతో ఖాళీలు భర్తీకాని పక్షంలో ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన నర్సింగ్ కాలేజ్/ యూనివర్సిటీ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం)కోర్సులో ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు సంబంధిత మెయిల్‌కు తమ రెజ్యూమ్‌లను పంపించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: వాక్ఇన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా.
షెడ్యూలు: 29.12.2020, ఉదయం 10 గం.
జీతభత్యాలు: నెలకు రూ.12,900 (కన్సాలిడేటెడ్) చెల్లిస్తారు.
పనిప్రదేశం: ఆధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పాఠశాలల్లో పని చేయాలి.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి ఫీజు లేదు.
ఈమెయిల్: apswreishealth@gmail.com
దరఖాస్తుకు చివరితేది: 28.12.2020 సాయంత్రం 5 గంటల లోపు పంపించాలి.
No comments:
Post a Comment