భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగానికి చెందిన కింది గ్రూప్-సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐఓ) (గ్రేడ్-2)/ ఎగ్జిక్యూటివ్
ఖాళీల సంఖ్య: 2000
కేటగిరీల వారీగా ఖాళీలు..
అన్రిజర్వ్డ్ - 989
ఈడబ్ల్యూఎస్ - 113
ఓబీసీ - 417
ఎస్సీ - 360
ఎస్టీ - 121
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆన్లైన్), ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్షా విధానం:
టైర్-1: ఆన్లైన్ పద్ధతిలో టైర్-1 పరీక్ష ఉటుంది. దీనిని 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. దీన్ని 5 విభాగాలుగా విభజించి విభాగానికి 20 ప్రశ్నల చొప్పున(ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు) ఇస్తారు. పరీక్షా సమయం ఒక గంట. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, న్యూమరికల్/ అనలైటికల్/ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
టైర్-2: డిస్క్రిప్టివ్ పద్ధతిలో టైర్-2 పరీక్ష ఉంటుంది. దీన్ని మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 30 మార్కులకు ఎస్సై రైటింగ్ ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ ప్రేజెస్ రైటింగ్ ఉంటాయి. దీనికి పరిక్షా సమయం ఒక గంటగా కేటయించారు.
టైర్-3: ఇందులో ఇంటర్వ్యూ ఉంటుంది. దీన్ని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
* దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
* అభ్యర్థులు గరిష్ఠంగా మూడు పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
SBI చలనా రూపంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2021
No comments:
Post a Comment