Wednesday, December 30, 2020

SSC CGL 2020 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 6 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ!

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2020' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు దశల్లో (టైర్-1,టైర్-2, టైర్-3, టైర్‌-4) అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వివరాలు..

* కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2020

మొత్తం ఖాళీలు: 6,506

1) గ్రూప్-బి గెజిటెడ్: 250

2) గ్రూప్-బి నాన్ గెజిటెడ్‌: 3513

3) గ్రూప్-సి: 2743

పోస్టులు..
➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్
➥ అసిస్టెంట్
➥ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
➥ ఇన్‌స్పెక్టర్ (పోస్టల్ శాఖ)
➥ ఇన్‌స్పెక్టర్ (నార్కోటిక్స్)
➥ అసిస్టెంట్ సూపరింటెండెంట్
➥ డివిజనల్ అకౌంటెంట్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/ CBN)
➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్
➥ ఆడిటర్
➥ అకౌంటెంట్
➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
➥ ట్యాక్స్ అసిస్టెంట్
➥ అప్పర్ డివిజన్ క్లర్క్

అర్హత: ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.01.2021 నాటికి కొన్ని పోస్టులకు 18-27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 30 - 32 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2, టైర్-3, టైర్-4 పరీక్షల ద్వారా.

పరీక్ష విధానం..

* టైర్‌-1: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌

* టైర్‌-2: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌

* టైర్‌-3: పెన్ అండ్ పేప‌ర్ విధానంలో(డిస్క్రిప్టివ్ పేప‌ర్‌)

* టైర్‌-4: క‌ంప్యూట‌ర్ ప్రోఫిషియ‌న్సీ టెస్ట్‌/ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్‌.

దర‌ఖాస్తు ఫీజు: ఇత‌రుల‌కు రూ.100, ఎస్సీ/ ఎస్టీ/ స్త్రీ/ దివ్యాంగులు/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్యర్థుల‌కు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

‣ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ: 29.12.2020 నుంచి 31.01.2021 వరకు.

‣ ఆన్‌లైన్ పేమెంట్ చెల్లింపున‌కు చివ‌రితేది: 02.02.2021.

‣ ఆఫ్‌లైన్ పేమెంట్ (చ‌లాన్ ద్వారా) చెల్లింపున‌కు చివరితేది: 04.02.2021.

‣ టైర్‌-1 ప‌రీక్ష ‌తేది: 29.05.2021 నుంచి 07.06.2021 వ‌ర‌కు.

‣ టైర్‌-2 ‌ప‌రీక్ష ‌తేది: వెల్లడించాల్సి ఉంది.




Website

No comments:

Post a Comment